టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ పై ఫోకస్ పెడుతున్న టాలీవుడ్..!
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత టాలీవుడ్ లో కూడా అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాలు రూపొందుతున్నాయి. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా హై క్వాలిటీ చిత్రాలను మన ఫిలిం మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని ప్రేక్షకులను సరికొత్త కథలని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆడియన్స్ కి కొత్త అనుభూతిని ఇవ్వడానికి సోషియో ఫాంటసీ జోనర్ లో టైమ్ ట్రావెలింగ్ చిత్రాలను రూపొందించడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం నుంచి వర్తమానానికి.. వర్తమానం నుంచి భవిష్యత్ కు.. ఇలా ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకెళ్లడానికి మేకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం టైమ్ మిషన్ - టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో నాలుగు సినిమాల నిర్మాణం చేపడుతున్నారని తెలుస్తోంది.
టైమ్ ట్రావెలింగ్ అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే సినిమా 'ఆదిత్య 369'. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రేక్షకులకు 'టైమ్ మిషన్' అనే ఒక యంత్రాన్ని పరిచయం చేసి వేరే కాలంలోకి తీసుకెళ్లిన సినిమా ఇది. ఈ సినిమా వచ్చిన 30 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్ గా ''ఆదిత్య 999 మ్యాక్స్'' అనే సినిమాకి బాలయ్య శ్రీకారం చుట్టారు. ఐడియాతోనే ఈ టైం మిషన్ చిత్రానికి కథ రెడీ చేస్తున్నారు బాలకృష్ణ. ఈ చిత్రంతో తనయుడు మోక్షజ్ఞ ని హీరోగా లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించారు. 2023లో ఈ సినిమా ఉంటూ8ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీనికి బాలయ్య దర్శకత్వం కూడా వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా ఈసారి బాలకృష్ణ తన కుమారుడితో కలిసి టైమ్ మిషన్ లో పయనించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 'ప్రాజెక్ట్ K' అనే పేరుతో రీసెంటుగా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ఈ సినిమా థర్డ్ వరల్డ్ వార్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ మరియు సోషియో ఫాంటసీ జోనర్స్ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. టైమ్ మిషన్ కాన్సెప్ట్ తో ఫ్యూచర్ లో మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎదుర్కోడానికి ఈ సినిమా కథాంశమని ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ చిత్రానికి మెంటర్ గా సింగీతం శ్రీనివాస్ ని పెట్టుకున్నారని తెలుస్తోంది.
నందమూరి కల్యాణ్ రామ్ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న సినిమా ''బింబిసార'' కూడా చారిత్రక నేపథ్యమున్న సోషియో ఫాంటసీ టైం ట్రావెల్ మూవీ అని తెలుస్తోంది. టైమ్ మెషిన్ సహాయంతో మగధ రాజ్యాన్ని పాలించిన బార్బేరియన్ కింగ్ బింబిసార కాలానికి వెళ్తారని టాక్. ఇదొక చెడు నుంచి మంచి వైపు సాగిన టైం ట్రావెల్ మూవీ అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాతో కొత్త దర్శకుడు వశిష్ఠ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇందులో కేథరీన్ ట్రెసా - సంయుక్తా మేనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా పలు భారతీయ భాషల్లో 'బింబిసార' ను విడుదల చేయనున్నారు.
అలానే యువ హీరో శర్వానంద్ కూడా టైమ్ మిషన్ కాన్సెప్ట్ తో ఓ ఫాంటసీ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఓ డెబ్యూ డైరెక్టర్ ఇటీవల టైం ట్రావెల్ కథాంశంతో శర్వా ను మెప్పించారని అంటున్నారు. టైమ్ మిషన్ ద్వారా హీరో తన బాల్యంలోకి వెళ్లి ఆ రోజుల్లో ఎలా ఉండేవారో తెలుసుకోవడనే ఈ కథ అని ప్రచారం జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ లో ఇప్పుడు టైమ్ ట్రావెలింగ్ ట్రెండ్ నడుస్తోందనేది అర్థం అవుతోంది.