‘శంకర్ దాదా’ సింగర్ ఇక లేరు.. చిత్ర పరిశ్రమలో విషాదం..

Update: 2021-12-27 06:39 GMT
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు.

1943 డిసెంబరు 10న జన్మించిన మాణిక్య వినాయగం.. తన మామయ్య, గాయకుడు సీఎస్ జయరామన్ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నారు. ‘దిల్’(2001) అనే తమిళ చిత్రంతో గాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.

అన్ని భాషల్లో కలిపి 800లకు పైగా పాటల్ని పాడారు. వేలసంఖ్యలో ఆధ్యాత్మిక, జానపదాల్ని ఆలపించారు. ఆయన పాడిన ప్రతిపాటా సంగీత అభిమానుల్ని ఉర్రూతలూగించింది.

చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రంలోని ‘పట్టుపట్టు చేయ్యే పట్టు’తో టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. గాయకుడిగానే కాకుండా నటుడిగానూ తనదైన ముద్ర వేశారు. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. మాణిక్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు.


Tags:    

Similar News