ట్రెండీ స్టోరి: ఇంత బిజీలో చీర క‌ట్టే టైముందా?

Update: 2021-09-05 08:30 GMT
చీర‌క‌ట్టులో మ‌గువ అందాన్ని వ‌ర్ణించేందుకు కాళిదాసులైనా క‌వులైపోతున్నారు మ‌రి. న‌ల్లంచు తెల్ల‌చీరైనా.. తెల్లంచు న‌ల్ల‌చీరైనా..పైటంచు రెప‌రెప‌ల‌కి.. ఫిదా అయిపోవాల్సిందే. చీర గొప్ప‌త‌నం అలాంటిది మ‌రి. క‌రిమ‌బ్బుల్లో చంద‌మామ దాప‌రికం ఎంత‌సేపూ.. మ‌బ్బు తొల‌గ‌గానే  వెన్నెల మ‌త్తు... చీర తెర‌ల‌లో వ‌య‌సు పున్న‌మి ఊసులు వెన్నెల‌క‌న్నా మ‌త్తు గ‌మ్మ‌త్తు.. న‌చ్చిన నిచ్చెలి చీర క‌డితే బంధనంలో ఉండ‌లేక బ‌య‌ట‌పుడుతూ.. మ‌న్మ‌ధుని విల్లు క‌న్నా ఒంపులు పోయే న‌డుము... ఇంత‌కీ అందం చీర‌లో ఉందా..చీర కట్టిన చిన్న‌దానిలోనా ! అంటూ ఈ ముగ్గుర్ని చీర సోయ‌గాల్ని క‌వితాత్మ‌కంగా వ‌ర్ణించేస్తున్నారు.

సోష‌ల్ మీడియాల పుణ్య‌మా అని ఇటీవ‌లి కాలంలో బొత్తిగా చీర క‌రువైంది. చీరందం చూద్దామంటే క‌నిపించ‌దు. ఒక‌వేళ చీర క‌ట్టు క‌ట్టినా కానీ అది కూడా మోడ్ర‌న్ ప‌విట దోపిడితో ఏదో డిజైన‌ర్ వేర్ ధ‌రించిన‌ట్టే క‌నిపిస్తోంది కానీ పల్లె ప‌ట్టు చీర‌క‌ట్టు క‌నిపించ‌డం లేదు. కానీ ఇదిగో ఇక్క‌డ కొంద‌రు చంద‌మామ‌లు ప‌ట్టు చీర‌ల్లో ఎంతో ఒద్దిక‌గా క‌నిపిస్తున్నారు. న‌యా శారీ మోడ‌ల్ కి బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మెరిసిపోతున్నారు.

చెన్నై బ్యూటీ సాయిప‌ల్ల‌వి.. ముంబై బ్యూటీ పూజాహెగ్దే.. కూర్గ్ సోయ‌గం ర‌ష్మిక మంద‌న చీరందంలో మ‌త్తెక్కిస్తు న్నారు .. యువ‌త‌రాన్ని మైమ‌రిపిస్తున్నారు. ర‌క‌ర‌కాల సంద‌ర్భాల‌లో ఈ భామ‌ల శారీ లుక్ చూపురుల‌ను ఆక‌ర్షించింది.  లైట్  బ్లూ డిజైన్ సారీలో సాయిప‌ల్ల‌వి త‌ళుక్కున మెరిసింది. చీర లో సంప్ర‌దాయ‌మైన ఫోజులిచ్చి ఆ చీర‌కే వ‌న్నె తీసుకొచ్చింది. సాధార‌ణంగా గ్లామ‌ర్ ఎలివేష‌న్స్ కి దూరంగా ఉండే ఈ బ్యూటీ చీర‌లో మ‌రింత అందంగా క‌నిపిస్తుంది. ఇక ర‌ష్మిక మంద‌న డార్క్ బ్లూ క‌ల‌ర్ చీర‌లో లంగావోణీ ద‌రించింది. ముఖమందంలో ఆ కిల కిల న‌వ్వులు మ‌రింత అందాన్ని తీసుకొచ్చాయి. రెండు చేతుల‌తో నేల‌ను తాకుతున్న ప‌రికిణీ  పైకెత్తుతూ తెలుగ‌మ్మాయినే త‌ల‌పించింది.

ఇక పూజా హెగ్డే ముదురు ఆకుప‌చ్చ రంగు సింపుల్ సారీ ..మ్యాచింగ్ జాకెట్ ధ‌రించింది. మెడ‌లో డిజైన్ న‌క్లెస్ ని ధ‌రించింది. అలా రెండు చేతులు ముందుకు జోడించి సంప్ర‌దాయ ప‌ద్ద‌తి లుక్ లో ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ముగ్గురు వేర్వేరు సంద‌ర్భాల్లో క‌ట్టిన చీర అందాల్ని ఇన్ స్టా పాలోవ‌ర్స్ ప‌క్క ప‌క్క‌న అమ‌ర్చి చీర అదాల్ని చూసి త‌రించండ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ గా మారాయి. ఈ ముగ్గురు భామ‌లు తెలుగులో  వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ల‌గా ఈ ముగ్గురు భామ‌లు కొన‌సాగుతున్నారు.

పూజా న‌టించిన మూడు సినిమాలు రిలీజ్ ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ప్ర‌భాస్ స‌ర‌స‌న పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` లో న‌టిస్తోంది. ఇది 1970 కాలం నాటి పీరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ.  ఇందులో పూజా పాత్ర‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంద‌ని తెలుస్తోంది. పాత్ర స్వ‌భావం కూడా చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని పూజా తెలిపింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న `ఆచార్య`లో నీలాంబ‌రి  పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ పాత్ర చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంద‌ట‌. అక్కినేని అఖిల్ స‌ర‌స‌న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంలోనూ పూజా కి అద్భుత‌మైన పాత్ర ల‌భించింది. ఇప్ప‌టికే అఖిల్ తో రొమాన్స్ ఓ రేంజులో కుదిరిందంటూ ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక కోలీవుడ్ లో ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న `బీస్ట్ `లో  రొమాన్స్ చేస్తోంది. బాలీవుడ్ లో `సిర్క‌స్` లో ర‌ణ‌వీర్ సింగ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్క‌నున్న కొత్త ప్రాజెక్ట్ లోనూ పూజా హెగ్దే హీరోయిన్ గా ఎంపికైంది.

మ‌రోవైపు సాయి ప‌ల్ల‌వి బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉంది. రానా స‌ర‌స‌న న‌టించిన విరాట ప‌ర్వం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అలాగే నాగ‌చైత‌న్య స‌ర‌స‌న న‌టించిన ల‌వ్ స్టోరి ఈనెల 10న‌ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. త‌దుప‌రి సాయిప‌ల్ల‌వి విరుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. అలాగే రష్మిక మంద‌న పుష్ప డ్యూయాల‌జీలో క‌థానాయిక‌. బాలీవుడ్ లో మూడు సినిమాల‌తో బిజీ అయ్యింది. అక్క‌డ మిష‌న్ మ‌జ్ను.. గుడ్ భాయ్ చిత్రాలు ఇప్ప‌టికే సెట్స్ లో ఉన్నాయి.
Tags:    

Similar News