ప‌వ‌న్ టైటిల్ కోసం హ‌రీష్ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌?

Update: 2021-09-05 15:30 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించే త‌దుప‌రి చిత్రం టైటిల్ సస్పెన్స్ ఇంకా వీడేట్టు లేదు. `హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు` త‌ర్వాత `భీమ్లా నాయ‌క్` అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ప‌వ‌న్ కోసం త‌దుప‌రి హ‌రీష్ శంక‌ర్ ఆస‌క్తిక‌ర టైటిల్ ని ఎంపిక చేసుకున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా `భ‌వ‌దీయుడు` అనే టైటిల్ ని ఫైన‌ల్ చేసుకున్నాడ‌ని దీనికి భ‌గ‌త్ సింగ్ అనేది ట్యాగ్ లైన్ లో వ‌చ్చేలా జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తొలుత భ‌గ‌త్ సింగ్ అనే టైటిల్ పెడితే బావుంటుంద‌ని భావించినా కానీ వివాదాల‌కు ఆస్కారం ఉంటుంద‌ని వెన‌క్కి త‌గ్గార‌ట‌. మొత్తానికి గ‌బ్బ‌ర్ సింగ్ లాంటి మాస్ టైటిల్ తో మాసివ్ హిట్ కొట్టిన హ‌రీష్ ఈసారి క్లాస్ టైటిల్ పై దృష్టి సారిస్తున్న‌ట్టే  అనిపిస్తోంది. భ‌వ‌దీయుడు అనేది క్లాస్ గా ఉన్నా ప‌వ‌న్ శైలి మ్యాన‌రిజం మాస్ ఎలిమెంట్స్ కి కొద‌వేమీ లేకుండానే క‌థాంశాన్ని ఎంపిక చేసుకున్నారు హ‌రీష్. చివ‌రికి ఎలాంటి టైటిల్ ని ఎంపిక చేసుకుంటారు? మునుముందు ఏం జ‌రుగుతుందో కాస్త వేచి చూడాలి.

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు హిస్టారిక‌ల్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం. దీనికోసం దాదాపు 150 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్ గా తెర‌కెక్కుతున్న భీమ్లా నాయ‌క్ విభిన్న‌మైన క‌థాంశం ఉన్న చిత్రం. ఇద్ద‌రి మ‌ధ్య‌ ఈగో నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించే సినిమా ఇది. ఈ రెండిటికీ భిన్న‌మైన క‌థాంశాన్ని హ‌రీష్ శంక‌ర్ ఎంపిక చేసుకున్నారట‌.
Tags:    

Similar News