• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విజయ్ హిట్ చిత్రానికి...

విజయ్ హిట్ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మురగదాస్

By - Tupaki Desk
Update: 2020-03-19 17:30 GMT
దేశ వ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో తమిళ నటుడు విజయ్ ఒకరు. అభిమానులు ముద్దుగా 'దళపతి' అని పిలుచుకునే విజయ్ ని అతని ఫ్యాన్స్ దేవుడిలా ఆరాధిస్తారు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న అతికొద్ది పరభాషా నటులలో విజయ్ మొదటి వరసలో ఉంటాడు. తుపాకి, సర్కార్, పోలీసోడు, విజిల్ మరియు అదిరింది లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. మరోవైపు ఇండియాలో చెప్పుకోదగ్గ దర్శకులలో ఎఆర్ మురుగదాస్ ఒకరు. వీరిద్దరి కలయికలో ఇప్పటి దాకా రూపుదిద్దుకున్న అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. తుపాకి, సర్కార్ వీరిద్దరి కలయికలో వచ్చి తమిళ్ తోపాటు తెలుగులో కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు తమిళ మీడియాలో వీరిద్దరి గురించి ఒక ఆసక్తికర వార్త బయటకి వచ్చింది. 'దళపతి' విజయ్ మురగదాస్ లు మళ్ళీ కలవబోతున్నారనేది ఈ వార్త సారాంశం. అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఈ సినిమా 2012 లో విడుదలైన బ్లాక్ బస్టర్ 'తుపాకి' సీక్వెల్ అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం అన్ని బాషలలో ఒకేసారి విడుదల కానున్నదని సమాచారం. సన్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు కోలీవుడ్ లో వార్త వినిపిస్తుంది. ఈ వార్తలకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. విజయ్ - మురగదాస్ లు మళ్ళీ జోడీ కడుతున్నారన్న వార్త విని విజయ్ ఫ్యాన్స్ సంతోషాన్ని వెలిబుచ్చుతున్నారు. ఈ సినిమా పట్టాలెక్కితే వీరిద్దరి కలయికలో మరో బ్లాక్ బస్టర్ పడినట్లే అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
Tags:    
  • Thuppakki Sequel On The Cards 
  • Arm And Vijay Doing Movie Again 
  • Vijay And Arm Movie 
  • Kollywood 
  • Kollywood News 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tupaki Updates 
  • Tupaki Updates 

Similar News

సరైన దారి తెలియకపోయినా.. విజయ్ బాటలో మాత్రం నడవని సూర్య!

2026-11-09 06:59 GMT

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

రామాయణం బడ్జెట్‌లో 9 శాతంతో తెరకెక్కిన గాడ్జిల్లా మైనస్ జీరో దూకుడు!

2026-11-09 06:05 GMT

జపనీయుల మధ్య దేవరకొండ ఫ్యామిలీ స్పెషల్ దివాళీ.. వీడియో వైరల్!

2026-11-09 05:26 GMT

రామాయణంపై ఈ తరం వింత ప్రశ్న..!

2026-11-09 04:58 GMT

ర్యాపిడ్ ఫైర్ లో చైతూను ఇరికించేసిన సుమా.. ఏం క్లారిటీ గురూ!

2026-11-09 04:25 GMT

హీరోయిన్ అవ్వాలంటే.. అందమే ముఖ్యమా.. జాన్వీ..?

2026-11-09 04:25 GMT

వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌తో రేసులో అగ్ర నిర్మాణ సంస్థ

2026-11-09 04:24 GMT

ప్రభాస్ ఈ సినిమాలకు సీక్వెల్స్ చేస్తే బాగుంటుందా?

2026-11-09 04:16 GMT

ఎడిట‌ర్ ఆవేద‌న‌: ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ప‌ట్టించుకోని శాఖ ఇది!

2026-11-09 03:40 GMT

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS