నాకు అతడితో సంబంధం లేదు: ఆలియా

Update: 2020-05-22 13:00 GMT
బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య ఆలియా సిద్ధిఖీ రెచ్చిపోతోంది. ఇటీవలే నవాజుద్దీన్ కు విడాకుల నోటీసులు పంపి సంచలనం సృష్టించిన ఆమె తాజాగా తనకున్న ఎఫైర్స్ కారణంగా విడాకులిచ్చిందన్న ప్రచారానికి బదులిచ్చారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఖాతా తెరిచి మరీ వివరణ ఇచ్చారు.

తాజాగా ఆలియా సిద్ధిఖీ ట్విట్టర్ లో ‘నా గురించి నిజాలు చెప్పాలనే ట్విట్టర్ లో ఖాతా తెరిచానని.. అపార్థాలు తొలగించాలనుకుంటున్నానని.. నిశ్చబ్దాన్ని దుర్వినియోగం  చేసి అసత్యాలు ప్రచారం చేసే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ పనిచేస్తున్నానని’ వివరణ ఇచ్చింది.

ఇక తనకు ఎవరితోనూ ఎఫైర్ లేదని.. ఇలాంటి వదంతులు ఆపాలని ట్విట్టర్ లో పేర్కొంది.  వయాకామ్ ఎగ్జిక్యూటివ్ పీయూష్ పాండేతో తాను ప్రేమలో ఉన్నట్లు వచ్చిన వార్తలు అబద్దమని ఆలియా వాటిని ఖండించింది. తాను పీయూష్ తో కలిసి ఉన్నట్టు ఫొటోను మీడియా సృష్టించిందని ఆరోపించారు.  డబ్బుతో నిజాలను కొనలేరంటూ భర్తపై విమర్శలు చేసింది.

ఇక తన భర్త పీయూష్ తో ఎఫైర్ పై డిటెక్టివ్ లను నియమించాడన్న వార్తలపై ఆలియా స్పందించింది. ఆయన అలాంటి పనులు చేయలేదని.. పెళ్లి అయినప్పటి నుంచి కుటుంబంలో గొడవలు.. వ్యక్తిగత సమస్యలతో విడిపోతున్నామని పేర్కొంది.
Tags:    

Similar News