థమన్ మోస్ట్‌ వాంటెడ్‌ అనడానికి ఇదే సాక్ష్యం

Update: 2021-07-22 11:30 GMT
సంగీత దర్శకుడు థమన్‌ మెల్ల మెల్లగా టాలీవుడ్‌ స్టార్‌ మ్యూజిక్ కంపోజర్‌ గా మారిపోయాడు. ఒకానొక సమయంలో చిన్న చిన్న సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ వచ్చిన థమన్‌ ఇప్పుడు టాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ స్టార్స్ సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. అది కూడా ఒకేసారి అయిదు ఆరుగురు బిగ్‌ స్టార్‌ సినిమాలకు ఈయన సంగీతాన్ని అందిస్తున్నాడు. గత ఏడాది వచ్చిన అల వైకుంఠ పురంలో సినిమా మ్యూజిక్ ఆల్బం బిగ్గెస్ట్‌ సక్సెస్ ను దక్కించుకున్న నేపథ్యం లో థమన్ మరింత గా బిజీ అయ్యాడు. ఆ పాటలు ఇప్పటికి మారు మ్రోగుతూనే ఉన్న కారణంగా థమన్‌ కు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

థమన్‌ ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తో మొదలుకుని చిరంజీవి లూసీఫర్‌... పవన్ కళ్యాణ్‌ సినిమాకు.. వరుణ్‌ తేజ్‌ సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల ఈయన శంకర్‌ దర్శకత్వంలో చరణ్ హీరోగా రూపొందబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా ఎంపిక అయ్యాడు. మొత్తానికి టాలీవుడ్‌ లో బిగ్గెస్ట్‌ క్రేజీ సినిమా లకు ఈయనే సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ ఏడాదిలో మరిన్ని భారీ సినిమాలకు కూడా ఆయనే వాయించడం ఖాయంగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

చేతిలో ఇన్ని సినిమాలు ఉన్న కారణంగా థమన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ మ్యూజిక్ కంపోజర్‌ అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల్లో కనీసం రెండు మూడు సక్సెస్‌ అయినా కూడా ఆయన క్రేజ్‌ మరింతగా పెరగడం ఖాయం. బాలీవుడ్‌ నుండి కూడా ఈయనకు ఆఫర్లు వస్తున్నాయని.. ప్రస్తుతానికి టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ లోనే ఈయన బిజీగా ఉండటం వల్ల అటు వైపుగా ఆలోచన చేయడం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. టాలీవుడ్ లో ఈయన సంగీతంకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. కనుక ఫిల్మ్‌ మేకర్స్‌ మరియు స్టార్స్‌ ఈయన్నే కోరుకుంటున్నారు.
Tags:    

Similar News