అదే డైరెక్టర్ ని రిపీట్ చేస్తోన్న నిర్మాత!
తాజాగా సుధాకర్ చెరుకూరి కూడా రాజుగారి విధానాన్నే అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఆయన నిర్మించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.;
ఒకప్పుడు సక్సెస్ పుల్ కాంబినేషన్స్ లో వెంట వెంటనే ప్రాజెక్ట్ లు ప్రకటించేవారు. ఈ ఆర్డర్ లో నిర్మాతలు మాత్రం పెద్దగా కనిపించే వారు కాదు. దర్శక-హీరోల కాంబినేషనే హైలైట్ అయ్యేది. కొంత మంది అగ్ర నిర్మాతలు మాత్రమే డైరెక్టర్లను ఎక్కువగా రిపీట్ చేసేవారు. కానీ ఇప్పుడా ఛాన్స్ చాలా మంది నిర్మాతలు తీసుకుంటున్నారు. ఒక సినిమా హిట్ అయిందంటే వెంటనే మరో చిత్రం కోసం అదే డైరెక్టర్ని తెలివిగా లాక్ చేసి పెడుతున్నారు. ఈ వరుసలో ఎక్కువగా దిల్ రాజు పేరు వినిపిస్తోంది. హీరోలనైనా..డైరెక్టర్లను అయినా ఆయన లాక్ చేసినంతగా మరో నిర్మాత చేయలేకపోయేవారు.
తాజాగా సుధాకర్ చెరుకూరి కూడా రాజుగారి విధానాన్నే అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఆయన నిర్మించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లో సక్సెస్ పుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో అదే డైరెక్టర్ తో సుధాకర్ మరో చిత్రాన్ని ప్రకటించారు. కిషోర్ తోనే ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇది కిషోర్ మార్క్ లవ్ స్టోరీగా తెలుస్తోంది. లవ్ స్టోరీలు తీయడంలో కిషోర్ ప్రత్యేకత వేరు. ఇంత వరకూ అతడు తెరకెక్కించిన ఏ సినిమా ఫెయిలవ్వలేదు.
హిట్ సహా యావరేజ్ గా ఆడిన ట్రాక్ రికార్డు కిషోర్ సినిమాలకు ఉంది. ఈ నేపథ్యంలో అదే బ్యానర్లో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. అలాగే చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తోన్న చిత్రాన్ని కూడా సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా మరో రెండు నెలల్లో ప్రారంభమవుతుందన్నారు. అలాగే శ్రీకాంత్ దర్శకత్వం లో నాని హీరోగా నటిస్తోన్న `ది ప్యారడైజ్` ను కూడా ఈయనే నిర్మిస్తున్నారు. అంతకు ముందు శ్రీకాంత్ తెరకెక్కించిన `దసరా` సినిమాను కూడా సుధాకర్ నిర్మించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
అందులోనూ నాని హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇలా సక్సెస్ పుల్ దర్శకులు ఎవర్నీ సుధాకర్ కాంపౌండ్ దాటకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు. స్టోరీలపై కూడా మంచి అవగాహన కలిగిన నిర్మాత. అందుకే ప్రతిభు వంతులైన దర్శకుల్ని పట్టుకుంటున్నాడు. ఇండస్ట్రీకి కావాల్సింది ఇలాంటి నిర్మాతలే. ఇలాంటి వారితోనే ప్రయోగాలకు ఆస్కారం ఉంటుంది. అలాగే `అరుంధతి` తరహా సినిమా కూడా ఒకటి తీయాలని ఉందని సుధకార్ రివీల్ చేసారు.