విరుష్క డాటర్ పేరు ఇదే.. సోషల్ మీడియాలో తొలి ఫొటో!

Update: 2021-02-01 06:52 GMT
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క ‌శ‌ర్మ త‌ల్లిదండ్రులైన విష‌యం తెలిసిందే. జనవరి 11న అనుష్క పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో అనుష్క డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్న కోహ్లీ.. తమ ఇద్దరి జీవితాల్లో ఇవాళ్లి నుంచి కొత్త అధ్యాయం ప్రారంభమైందని సంతోషంగా ప్రకటించాడు.

అయితే.. ఇప్పటి వరకూ తమ కూతురికి సంబంధించిన ఒక్క ఫొటోను కూడా అభిమానులతో పంచుకోలేదు ఈ దంపతులు. ఇదే విషయాన్ని పలువురు ప్రస్తావించగా.. తమ కూతురిని సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలనుకుంటున్నామని చెప్పిందీ జంట. అయితే.. ఎట్టకేలకు ఒక ఫొటోను సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. అంతేకాదు.. తమ కూతురికి పెట్టిన పేరు కూడా తెలియజేశారు.

తమ గారాల పట్టికి ‘వమిక’ అనే పేరు పెట్టినట్టు తెలియజేశారు. చిన్నారి రాకతో తమ జీవితంలో ఎన్నో భావోద్వేగాలు నిండాయని చెప్పారు. ఈ సమయంలో తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నట్టు ప్రకటించారు అనుష్క, కోహ్లీ.
Tags:    

Similar News