ఆ డైరెక్ట‌ర్ ఎవ్వ‌ర్నీ వ‌ద‌ల‌డు..అంద‌ర్నీ రౌండ‌ప్ చేస్తాడు!

Update: 2022-07-13 02:30 GMT
అత‌ను స్టార్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రు. కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చారు. మ‌రికొన్ని అట్ట‌ర్ ప్లాప్ లు అందించారు. డైరెక్ట‌ర్ క‌మ్ రైట‌ర్ కావ‌డంతో అతనికి ఇండ‌స్ర్టీలో మంచి పేరుంది. స్టార్ హీరోల ద‌గ్గ‌ర నుంచి యంగ్ హీరోల వ‌ర‌కూ అంద‌రితోనూ చ‌నువుగా మెలుగుతారు. నిర్మాత‌ల‌తోనూ..సహ‌చ‌ర ద‌ర్శ‌కులతోనే అంతే చ‌నువుగా న‌డుచుకుంటారు. అదే సాన్నిహిత్యంతో పిలిచిన వారి అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌కు తూచ త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతుంటారు.

ఇక ఆ ద‌ర్శ‌కుడికి మైక్ దొరికిందంటే దంపుడు ఏ రేంజ్ లో ఉంటుందో చెప్ప‌డం క‌ష్టం.  బేసిక్ గానే రైట‌ర్ కాబ‌ట్టి ప్రాస అలా త‌న్నుకొచ్చేస్తుంటుంది. పేపరు పై  కలం పెట్టి రాస్తే ఎంత అందంగా వ‌స్తుందో..అత‌ను మాట్లాడితే కూడా అంతే అందంగా  ఉంటుంది. సినిమా గురించి.. ఆ సినిమాలో ప‌నిచేసిన వారి గురించి చాలా గొప్ప‌గా చెబుతుంటారు.

అదే వేవ్ లో ఓ మాట కూడా వేసేస్తారు. భ‌య్యా నీతో సినిమా చేయాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కుద‌ర‌డం లేదు. ఈసారి మిస్ అవ్వ‌కూడ‌దు. తప్ప‌కుండా చేద్దాం అంటారు. ఆ హీరో రేంజ్ చిన్న‌దైతే అలాగా. స్టార్ హీరో అయితే  మాత్రం స‌ర్ ఎప్పుడు అవ‌కాశం ఇస్తారో? ఆ దేవుడికే  తెలియాలి అంటూ న‌వ్వేస్తారు. ఈ వ్యాఖ్యలు ప్ర‌తీ హీరో ఫంక్ష‌న్ లో కామ‌న్ గా ఉంటాయి ఆయ‌న వైపు నుంచి.
Read more!

ఇక రెండున్న‌రేళ్ల‌గా గ‌మ‌నిస్తే ఆ విధానం మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఏ హీరోని వ‌దిలిపెట్ట‌డం లేదు. హీరోలంద‌ర్నీ రౌండ‌ప్  చేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ఆ డైరెక్ట‌ర్ హీరోల్ని  లైవ్ ఇంట‌ర్వ్యూలు కూడా చేస్తున్నారు. అక్కడా అదే తంతు.  మ‌రి  ఇంత చేస్తున్నా.. దానిపై  డెవ‌లెప్ మెంట్ ఏదైనా ఉందా? అంతా శూన్య‌మ‌నే చెప్పాలి. అలా చెప్ప‌డం మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క సినిమా  కూడా చేయ‌లేదు.

పెపెచ్చు రెండున్న‌ర  ఏళ్లుగా ఖాళీగానే  ఉంటున్నారు. ఓ స్టార్ హీరోతో సినిమా  అనౌన్స్ చేసారు. కానీ ఆ మూవీ ఇంకా ప‌ట్టాలెక్క‌లేదు. ఎక్కుతుందో?  లేదో?  కూడా తెలియ‌దు. అయితే కొంత మంది యంగ్ హీరోల‌తో రెండు మూడు రోజులుగా క‌థా చ‌ర్చ‌ల్లో చురుకుగా పాల్గొంటున్న‌ట్లు  తెలిసింది. ఈ రెండున్న‌రేళ్ల పాటు రాసిపెట్టుకున్న కొన్ని క‌థ‌ల్ని యంగ్ హీరో ల‌కి వినిపిస్తున్నాడుట‌.

కానీ ఇంకా ఏ క‌థ ఒకే  అయిన‌ట్లు లేదు. మ‌రి ఈ స్టార్ మేక‌ర్ బ‌డా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చేది? ఎప్పుడో చూడాలి. కానీ ఆయ‌న సినిమా కోసం అభిమానులు మాత్రం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు అన్న‌ది వాస్త‌వం.
Tags:    

Similar News