వైర‌ల్ వీడియో: అచ్చం ఆలియానే

Update: 2019-02-07 10:31 GMT
ఒక‌రిని పోలిన మ‌నిషి ఇంకొక‌రు క‌నిపిస్తే అందులో మ్యాజిక్ చాలా గ‌మ్మ‌త్తుగానే ఉంటుంది. మ‌న పాత కాలం సినిమాల్లో డ‌బుల్ రోల్స్ ఎదురుప‌డి పంచ్ డైలాగులు కొట్టిన‌ప్పుడు క‌లిగే కిక్కు చూసేవాడికి క‌లుగుతుంది.  సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో అలాంటి స‌న్నివేశ‌మే క‌నిపిస్తోందిపుడు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఒకే పోలిక‌తో ఉన్న వాళ్లంద‌రినీ ఈజీగా క‌నిపెట్టేస్తున్నారు.  స్టార్ల‌ను ఇమ్మిటేట్ చేస్తూ ర‌క‌ర‌కాల చోట్ల నుంచి సోష‌ల్ మీడియాలో పోస్టింగులు పెడుతూ ట్విన్ లుక్ ఉన్న‌వాళ్లు అంద‌రికీ తెలిసిపోతున్నారు. ఇలా ఒకే పోలిక ఉన్న వాళ్ల‌ను డాపుల్‌ గ్యాంగ‌ర్ అని పిలుస్తున్నారు.

ఆ కోవ‌లోనే మొన్న‌టికి మొన్న అందాల అనుష్క శ‌ర్మ ను పోలిన వేరొక సెల‌బ్రిటీని క‌నిపెట్టారు. అమెరిక‌న్ సింగ‌ర్ జులియా మైకేల్స్ - అనుష్క శ‌ర్మ ఇద్ద‌రి ఫోటోల్ని క‌లిపి ఒకేలా ఉన్నారు అంటూ అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ చేసేశారు. ఆ త‌ర్వాత కొంత‌కాలానికి కండ‌ర‌గండ‌డు స‌ల్మాన్ ఖాన్ ని పోలిన‌వాడు వేరొక‌డు ఉన్నాడంటూ పాకిస్తాన్ లోని ఒక ఆసామిని ప‌ట్టేశారు. ఇలా ఒకే పోలిక‌తో ఎంద‌రో ఉన్నారు ఈ ప్ర‌పంచంలో.

ఇది వింతైన అనుభ‌వం అనే భావించాలి. తాజాగా బాలీవుడ్ హాట్ గాళ్ ఆలియాభ‌ట్ ని పోలిన మ‌రో ఆలియాభ‌ట్ ని క‌నిపెట్టేసింది ఈ ప్ర‌పంచం. సేమ్ టు సేమ్ అవే పాల‌బుగ్గ‌లు.. చిక్లెట్ క‌ళ్ల‌తో మాయ చేసింది ఈ బ్యూటీ. ఇటీవ‌లే రిలీజైన గ‌ల్లీ బోయ్ ట్రైల‌ర్ లోని `మ‌ర్ జాయెగా తూ` అనే డైలాగ్ ని చెప్పి ఆ వీడియోని సోష‌ల్ మీడియాలో స‌ద‌రు బాలిక వైర‌ల్ చేసింది. ఇదిగో... మ‌రో ఆలియా భ‌ట్ అంటూ ఆ వీడియోని, అలాగే ఆలియా తో ఆ అమ్మ‌డి ఫోటోని వైర‌ల్ చేసేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ కొత్త ఆలియా వీడియో పెద్ద హిట్ట‌య్యింది. ఇక గ‌ల్లీ బోయ్స్ క‌థాంశంలోకి వెళితే.. ఆ సినిమా ఇద్ద‌రు ఇండియ‌న్ ర్యాప‌ర్స్ క‌థాంశం అని తెలుస్తోంది. ప్ర‌ఖ్యాత భార‌తీయ ర్యాప‌ర్ నీజీ (న‌వీద్ షేక్) - డివైన్ (వివియ‌న్ ఫెర్నాండెజ్) ల క‌థాంశంతో ఫుల్ ఎన‌ర్జిటిక్ పంథాలో యూత్ కి కిక్కిచ్చేలా తీసిన‌ చిత్ర‌మిది. జోయా అక్త‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫిబ్ర‌వ‌రి 14న సినిమా రిలీజ‌వుతోంది. ఇందులో ర‌ణ‌వీర్ సింగ్ తో పాటు ఆలియా నెవ్వ‌ర్ బిఫోర్ అన‌ద‌గ్గ క్యారెక్ట‌ర్ లో గుబులు రేప‌నుందిట‌.

For Video Click Here
Tags:    

Similar News