• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చై-సామ్ విడిపోడానికి...

చై-సామ్ విడిపోడానికి సరోగసీ మరియు మూడో వ్యక్తే కారణమా..?

By - Tupaki Desk
Update: 2021-10-05 13:30 GMT
టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య - సమంత విడాకుల వ్యవహారం ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమ గోప్యతకు భంగం కలిగించొద్దని కోరినా.. పబ్లిక్ డొమైన్ లో ఉన్న సెలబ్రిటీలు కావడంతో వీరి విడాకుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో చై-సామ్ జంట విడిపోడానికి కారణాలు ఇవంటూ అందరూ విశ్లేషిస్తున్నారు. సామ్ కు మరొకరితో సంబంధం ఉందని.. కాదు చైతూ కు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందని.. ఇలా రకరకాల కథలు పుట్టుకొస్తున్నాయి. ఇద్దరి మధ్య ఏమి జరిగిందనేది వారికి వారి కుటుంబానికి మాత్రమే తెలుసు. కాకపోతే ఇద్దరి ప్రవర్తనలు.. ఇప్పటి వరకు వీరు గడిపిన జీవితాన్ని బట్టి కొందరు విడాకులకు కారణాలు ఇవేనంటూ చెబుతున్నారు. తాజాగా సీనియర్ జర్నలిస్ట్, ఫ్యామిలీ కన్సల్టెంట్ ప్రియ.. చైతన్య - సమంత విడిపోడానికి గల కారణాలను విశ్లేషించారు.

సమంత కెరీర్ ను దృష్టిలో పెట్టుకొని బిడ్డను కనడానికి ఇష్టపడకపోవడం.. సరోగసీ కి వెళ్లాలనుకోవడం ఇక్కడి దాకా రావడానికి కారణమని ప్రియా అన్నారు. అలానే వీరి బంధం బీటలు వాలడానికి మూడో వ్యక్తి కూడా కారణమని ఆమె తెలిపారు. ''నాలుగేళ్ళ వైవాహిక జీవితం తర్వాత పిల్లల్ని కనాలనే టాపిక్ వచ్చినప్పుడు సమంత మదర్ అవ్వడానికి ఇష్టపడ లేదు. తన కెరీర్ కు గ్లామర్ కు అడ్డమనుకొని సరోగసీ కి వెళ్లాలని సామ్ అనుకోవడం విడాకులకు ఒక కారణం. రెండోది ఆమె బోల్డ్ గా నటించడం అనేది మరొక కారణం అని ప్రియా అన్నారు. పెళ్లి కి ముందు బోల్డ్ పాత్రల్లో నటిస్తే తప్పులేదు కానీ.. ఓ పెద్ద కుటుంబం లోకి కోడలిగా వచ్చిన తర్వాత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె తీసుకునే ప్రతీ నిర్ణయం కూడా నీ కుటుంబం మీద పడుతుంది.. మీరు కనబోయే పిల్లల మీద పడుతుంది. కెరీర్ ముఖ్యమని భావిస్తే సింగిల్ గా ఉండటం బెటర్. అన్నీ అయిపోయాయి ఇంకేమి మిగలలేదు అనుకున్నప్పుడు మ్యారేజ్ చేసుకోండి'' అని ప్రియా చెప్పారు.

''సమంత అప్పుడు రెండు పెద్ద కుటుంబాలకు కోడలిగా వెళ్తుందన్నదుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నానని చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది.. భర్త గురించి చాలా గొప్పలు చెప్పింది. కానీ ఇప్పుడు వారికి బీటలు వాలడానికి కారణం ఏంటి? సమంత పెళ్లికి ముందు గ్లామరస్ హీరోయిన్.. పెళ్లి తర్వాత ఆమె ఒక వర్సటైల్ యాక్ట్రెస్. పెళ్లి తర్వాత ఆమె కెరీర్ అంతలా బిల్డ్ అవ్వడానికి ఒకవైపు నాగార్జున మరోవైపు రామానాయుడు ఫ్యామిలీ ఉన్నాయి. వీళ్ళ వల్ల ఆమె కెరీర్ పెరిగిందనేది వాస్తవం. ఆమె ఏ స్టేట్మెంట్ ఇచ్చినా.. ఏ గ్లామర్ ఫోటో షేర్ చేసినా జనాలు యాక్సెప్ట్ చేశారు అంటే కారణం ఈ రెండు ఫ్యామిలీస్. అందుకే తను బోల్డ్ గా రిలీజ్ చేసిన గౌరవంగా చూశారు. ఆ కుటుంబాల వల్ల ఆమె కోరుకున్న దాని కంటే వంద రెట్లు జీవితం పొందగలిగింది''

''బిడ్డను కనే అవకాశం ఇచ్చినప్పుడు ఆమె సరోగసీ కి ఎందుకు వెళ్ళాలి? కెరీర్ కోసం అద్దె గర్భానికి వెళ్లాలని అనుకున్నప్పుడే భర్త-కుటుంబం దీనికి అనుమతి ఇవ్వడం లేదు. దీని వల్ల విడాకుల దాకా వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ ఆమె సరోగసీ కి వెళ్తాను అంటే రెండు పెద్ద కుటుంబాలు ఎలా ఒప్పుకుంటాయి? నాగార్జున గారు సమంత ను కూతురిగా చిల్ల పిల్లను సంకన ఎత్తుకున్నట్లు చూసేవారు. ఆ అమ్మాయి ఇప్పుడు అలాంటి ప్రేమను వదులుకొని విడాకులకు వెళ్లింది. నాగచైతన్య ఆల్రెడీ తన అమ్మానాన్నల బ్రేకప్ చూశాడు. అందుకే ఆ బంధం నుంచి విడిపోతే వచ్చే పరిణామాలు.. పరిస్థితులు అతనికి తెలుసు. ఒక్కసారిగా విడాకులు అని బ్లాస్ట్ చేశారు అంటే ఆ కుటుంబం కాంప్రమైజ్ చేయడానికి ఎంతగా ట్రై చేసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ బంధం బీటలు వాలడానికి కచ్చితంగా మూడో వ్యక్తి కూడా కారణం. ఇద్దరు భార్యాభర్తలు విడిపోయారు అంటే కారణం మూడో వ్యక్తి రావడమే. అది కుటుంబ సభ్యులు కావొచ్చు స్నేహితులు కావొచ్చు'' అని ప్రియా చెప్పుకొచ్చారు. సెలబ్రిటీలు 'మా జీవితం మా ఇష్టం' అని విడిపోవచ్చు కానీ.. అది కుటుంబ వ్యవస్థ మీద కచ్చితంగా బలమైన ముద్ర వేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

అయితే దీనిపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విడాకులు అనేది నాగచైతన్య - సమంత వ్యక్తిగత విషయం.. వారి మధ్య ఏమి జరిగిందనేది వాళ్ళకి మరియు కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. అలాంటిది ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి ఇలా ఎలా మాట్లాడతారని కామెంట్స్ చేస్తున్నారు. చై - సామ్ తాము విడిపోతున్నట్లు ప్రకటించినప్పుడే తన ప్రైవసీ కి ప్రైవసీ కి భంగం కలిగించొద్దని రిక్వెస్ట్ చేశారు. కానీ అందరూ స్టార్ కపుల్ విడిపోడానికి కారణాలు ఇవంటూ విశ్లేషించడం భావ్యం కాదని అభిమానులు అంటున్నారు. విడిపోయి వేర్వేరు మార్గాల్లో ప్రయాణించాలనుకున్న వారి గురించి ఇలాంటి ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయ పడుతున్నారు.




Full View
Tags:    
  • Samantha 
  • Naga Chaitanya 
  • Announce 
  • Divorce 

Similar News

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

Copyright @2026

Powered by Blink CMS