నల్ల కోటులోన ఏదో దాగి ఉంది సిత్రంగా..! ఏంటో అది సిత్రాంగదా!!
బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని అంగీకరించిన భామగా చిత్రాంగద పేరు అప్పట్లో మార్మోగింది. 2018లో #MeToo ఉద్యమం జోరుమీద ఉన్నప్పుడు.. లైంగిక దుష్ప్రవర్తన అనుచిత ప్రవర్తన అనేవి పరిశ్రమలో ఉన్నాయని తాను కూడా అలాంటివి ఎదుర్కొన్నానని బిగ్ బాంబ్ వేసింది.
ప్రతిచోటా ఇలాంటి వ్యక్తులు ఉన్నారని తాను మోడలింగ్ రోజుల నుండి వేధింపుల్ని ఎదుర్కొన్నానని చిత్రాంగద అనడం సంచలనమైంది. బాలీవుడ్ లోనే కాదు.. కార్పొరేట్ కూడా అంతే చెడ్డది అంటూ అన్ని రంగాల్లో జరుగుతున్న విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేసింది. పూర్తిగా బలవంతం చేయరు. గౌరవం ఇస్తూనే చాప కింద నీరులా తెర చాటు వ్యవహారాలు నడిపించేస్తారని వెల్లడించి షాకిచ్చింది. ఇలాంటి కారణాల వల్ల తాను కూడా వరుస ప్రాజెక్టులను కోల్పోయానని చిత్రాంగద ఆవేదన చెందింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే..`బాబ్ బిస్వాస్` అనే చిత్రంలో అభిషేక్ బచ్చన్ సరసన చిత్రంగద సింగ్ నటించనుంది. షారూక్ రెడ్ చిల్లీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా ఈ చిత్రం సెట్స్ కెళ్లలేదు. ఇంతకుముందు స్వీయ నిర్భంధంలో ఉన్నప్పుడు ఇదిగో ఇలా బంతి లాంటి రూపాన్ని సంపాదించిందిట. తన అందాల్ని దాచుకుంటే కలిగే ప్రయోజనం ఏదీ లేదని గ్రహించి ఇటీవల వరుస ఫోటోషూట్లతో దండయాత్ర చేస్తోంది. బ్లాక్ సూటు వెనక కవ్వించే అందాల వలను విసిరిందిలా. బ్లాక్ సూట్ వైట్ షర్ట్ .. కాంబినేషన్ చారల డిజైనర్ డ్రెస్ లో అదరగొట్టింది. నల్ల కోటులోన ఏదో దాగి ఉంది సిత్రంగా..! ఏంటో అది సిత్రాంగదా!! అంటూ బోయ్స్ పరేషాన్ అవుతున్నారు. ప్రస్తుతం చిత్రాంగద ఫోటోషూట్ వైరల్ గా మారింది.