ఇప్పుడు ఫ్యాన్స్ పెద్దగా కామెంట్స్ చేయడం లేదు!

Update: 2019-04-01 14:30 GMT
స్టార్ హీరోయిన్ సమంతా ప్రస్తుతం 'మజిలీ' ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. వివాహం తర్వాత భర్త నాగ చైతన్యతో కలిసి సమంతా నటించే చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి వ్యక్తం అవుతోంది.  రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన డ్రెస్సింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది సమంతా.  

సహజంగా హీరోయిన్లు పెళ్ళైన తర్వాత డ్రెసింగ్ స్టైల్ మార్చేస్తారు. హాటుగా కనిపించడం మానేస్తారు. కానీ చైతుతో వివాహం అయిన తర్వాత కూడా సమంతా వస్త్రధారణలో మార్పు రాలేదు. నిజానికి ఇంకా ఎక్కువ బోల్డ్ గా ఫోటో షూట్స్ చేసింది. ఈ విషయంలో అక్కినేని ఫ్యాన్స్ కూడా అప్సెట్ అయ్యారు.  ఈ విషయంపై సమంతాను ప్రశ్నిస్తే "ఒకప్పుడు అభిమానులు వైల్డ్ గా రియాక్ట్ ఆయన మాట నిజమే. కానీ ఇప్పుడు పెద్దగా కామెంట్లు చేయడం లేదు" అని చెప్పింది.  అక్కినేని కుటుంబ సభ్యులు ఎవరైనా మీ డ్రెస్సింగ్ పట్ల అభ్యంతరపెట్టారా అని అడిగితే.. అసలు అలా జరగలేదని తెలిపింది.  ఇంతవరకూ అక్కినేని కుటుంబం తనకు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదని చెప్పింది.

తనవల్ల కుటుంబ సభ్యులు ఎవరైనా ఫీల్ అయితే అలాంటి పనులు చేయనని.. ఒకవేళ వారు ఫలానా రకం డ్రెస్సులు వద్దు అని చెప్తే అది పాటిస్తానని తెలిపింది..  ఒక రిలేషన్ లో కాంప్రమైజులు కూడా ఉంటాయని ఒక్కోసారి సర్దుకోవలసి వస్తుందని అదేమీ తప్పు కాదని తెలిపింది. కానీ తనకు అలాంటి అవసరం రాలేదని చెప్పింది.  
    

Tags:    

Similar News