ఆ శృంగార సన్నివేశంలో నటిస్తున్న సమయంలో కన్నీరు ఆగలేదు

Update: 2021-02-18 01:30 GMT
హాలీవుడ్ లో ఇప్పుడు శృంగార సన్నివేశాలు కామన్‌ అయ్యాయి. హీరోయిన్‌ ల న్యూడ్ సన్నివేశాలు ఇప్పుడు తరుచు కనిపిస్తూనే ఉన్నాయి. కాని పాతిక ఏళ్ల ముందే న్యూడ్‌ సన్నివేశాల్లో నటించి అప్పట్లోనే సంచలన తారగా పేరు దక్కించుకుది సల్మా హయోక్‌. మెక్సికన్‌ బ్యూటీ అయిన సల్మా సుదీర్ఘ కాలం పాటు హాలీవుడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సల్మా న్యూడ్‌ సీన్స్ సినిమాలను ఎక్కడికో తీసుకు వెళ్లాయి. మొదట ఆమె నటించిన డెస్పరాడో అనే సినిమాలో న్యూడ్‌ సీన్స్ ను చేసింది. ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న ఫీలింగ్స్ ను తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని చెప్పింది.

డెస్పరాడో సినిమా దర్శక నిర్మాతలు ముందు న్యూడ్‌ సీన్స్ గురించి చెప్పలేదు. షూటింగ్‌ మద్యలో ఉన్న సమయంలో ఒక సన్నివేశం కోసం న్యూడ్‌ సన్నివేశంలో నటించాలని చెప్పారు. సినిమాకు అవసరం కనుక తాను నో చెప్పలేదు. ఆ సన్నివేశం షూటింగ్‌ సందర్బంగా తనను ఎవరు ఫోర్స్‌ చేయలేదు. తాను షూటింగ్‌ లో పాల్గొన్న సందర్బంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా తీసుకున్నారు. అయినా కూడా కెమెరా ముందుకు వెళ్లిన వెంటనే కన్నీరు ఆగకుండా వచ్చేస్తూనే ఉన్నాయి. ఈ సినిమాను తన తండ్రి సోదరుడు చూస్తారు. ఇలాంటి సీన్ లో నేను నటిస్తే వారు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే భావన నాకు కలిగినప్పుడు కన్నీరు ఆగలేదు. ఆ తర్వాత నాకు నేను సర్ది చెప్పుకుని ఆ సన్నివేశాలు చేశాను అంది.
Tags:    

Similar News