అక్కీకి 500కోట్లు పెడతారు కానీ.. నాకు 50కోట్లకు దిక్కులేదు!
అక్షయ్ కుమార్ -అజయ్ దేవగన్ వంటి బడా స్టార్లకు ధీటుగా 90లలో రాణించిన అతిపెద్ద యాక్షన్ స్టార్ సునీల్ శెట్టి. అతను పరిశ్రమలో సుమారు 30 సంవత్సరాల పాటు కెరీర్ ని సాగించారు. కానీ అతని స్టార్ డమ్ ఇటీవలి కాలంలో అంతకంతకు క్షీణించింది. అతని సమకాలీకులు అక్షయ్ - అజయ్ దేవగన్ ఒకరితో ఒకరు పోటీపడుతూ ఇప్పటికీ భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. బచ్చన్ లు.. కపూర్ లు.. ఖాన్ ల తర్వాత తమకంటూ ఒక రేంజు ఉందని నిరూపించారు. వరుసగా బ్లాక్ బస్టర్లు కొడుతూ మార్కెట్ ని సుస్థిరం చేసుకున్నారు. కానీ సునీల్ శెట్టికి సినిమాలే లేవ్.
తన సమకాలికులు ఎవరూ టచ్ చేయలేని పొజిషన్ కి చేరితే తాను మాత్రం ఎందుకనో కిందికి పడిపోయాడు. అయితే అలా ఎందుకు జరిగింది? అంటే ఆయనే పెదవి విప్పారు. నటుడిగా తన పురోగతికి ఆటంకం కలిగించిన చాలా అంశాల గురించి ఇటీవల సునీల్ శెట్టి ఓపెనయ్యారు.
తన తొలి చిత్రం `బల్వాన్` తర్వాత.. సునీల్ శెట్టి యాక్షన్ హీరోగా టైప్ కాస్ట్ అయ్యాడు. తరువాత మోహ్రా- బోర్డర్ వంటి కల్ట్ క్లాసిక్స్ లో నటించాడు. వీటికి తోడు అతని అత్యంత పాపులర్ సిరీస్ హేరాఫేరీలో కామెడీ రోల్ బాగా పండింది. ఇప్పటికీ ఈ ఫ్రాంఛైజీ రన్ అవుతోంది.
అయితే నటుడిగా ప్రయోగాలు చేయడానికి కొత్తవాటిని అన్వేషించడానికి తాను ఎప్పుడూ దూరంగా ఉంటానని సునీల్ శెట్టి అన్నారు. అతను ఎల్లప్పుడూ సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించారట. తాను ఏ నటులు లేదా దర్శకులతో పని చేయాలి? అనే దానిపై కఠినంగా ఉంటాడు. కానీ ఈ రోజుల్లో విజయవంతమైన నటులు తమదైన శైలితో గుర్తింపును పెంచుకున్నారని నిజాయితీగా అంగీకరించారు.
అక్షయ్ చిత్రాలలో 500 కోట్ల రూపాయల పెట్టుబడిని రిస్క్ చేయడానికి ఇండస్ట్రీ జనం సిద్ధంగా ఉన్నారని తాను నటించిన చిత్రానికి ఎవరూ 50 కోట్లు కూడా రిస్క్ చేయబోరని సునీల్ ఏదీ దాపరికం టేకుండా వివరించారు. ఫ్లాపులొస్తే ఇండస్ట్రీ పట్టించుకోనే పట్టించుకోదని తన అనుభవాన్ని తెలిపాడు. సునీల్ శెట్టి ఇటీవలే రజనీకాంత్ దర్బార్ చిత్రంలో నటించారు. అందులో అత్యంత క్రూరుడైన మాఫియా రోల్ పోషించి అదరగొట్టాడు. మొహ్రా చిత్రంలో నటించే సమయంలో అక్షయ్ ని డామినేట్ చేసే రేంజులో ఉన్న శెట్టి కెరీర్ ఆ తర్వాత అనూహ్యంగా పడిపోతుంటే అక్షయ్ గ్రాఫ్ అంతకంతకు పెరగడానికి కారణం అతడు విలక్షణమైన కథల్ని ఎంచుకుని ప్రయోగాలు చేయడమే. దానికి తోడు అతడు కామెడీ ఎంటర్ టైనర్లతో చేసిన ప్రయోగాలన్నీ పెద్ద సక్సెసయ్యాయి. బాక్సాఫీస్ వద్ద అతడు బాద్ షా అయ్యాడు తనదైన ఎంపికలతో. కానీ సునీల్ మాత్రం ఏ ప్రయోగానికి సిద్ధంగా ఉండడు. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు.