• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ కు కోపం...

ప్రభాస్ కు కోపం తెప్పించిన హీరోయిన్‌

By - Tupaki Desk
Update: 2021-09-16 13:30 GMT
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ప్రభాస్‌ కు సౌమ్యుడు అనే పేరు ఉంది. అందరితో మంచిగా ఉండే వ్యక్తిత్వం ఆయనది. అలాంటి వ్యక్తికి కోపం రావడం అంటే చాలా అరుదు. ప్రభాస్ కోపంను సినిమాల్లోనే చూస్తాం కాని నిజ జీవితంలో చూడము అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి ప్రభాస్ కు ఒక హీరోయిన్ కోపం తెప్పించింది. ఆమె వల్ల సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ చెడి పోయింది. అది కూడా ఫారిన్ షెడ్యూల్ చెడిపోవడం వల్ల ప్రభాస్ కు కోపం వచ్చింది. పదుల సంఖ్యల మంది ఫారిన్ వెళ్లి అక్కడ ఆమె కోసం వెయిట్‌ చేస్తున్నారు. రోజుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అలాంటి సమయంలో షూటింగ్ కు అంతరాయం కలిగించేలా ఆమె వ్యవహరించింది అంటూ ప్రభాస్ చాలా కోపంగా ఉన్నాడట. అప్పటి నుండి ఆమెతో సరిగా మాట్లాడక పోవడంతో పాటు ఆమెతో కాంబినేషన్ సన్నివేశాలను కూడా ప్రభాస్ ఇష్టపడలేదని వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ మొహమాటస్తుడు అవ్వడం వల్ల ఆమె పెట్టిన ఇబ్బందితో చాలా కోపం వచ్చిందని.. దాంతో ఆమెను దూరం పెట్టేలా ప్రయత్నిస్తున్నాడు అంటున్నారు. ఆమెతో రొమాంటిక్ సన్నివేశాలు మరియు లవ్ సన్నివేశాలను కూడా చేసేందుకు చివర్లో నో చెప్పాడట. దాంతో ఆ సన్నివేశాలను కొన్నింటిని వేరు వేరుగా చిత్రీకరించి చివరకు గ్రాఫిక్స్ లో కలిపినట్లుగా యూనిట్‌ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ప్రభాస్ మాత్రం దాన్ని తీసుకోలేక పోతున్నాడని.. ఆయన సున్నిత మనసు చాలా గాయ పడటం వల్లే ఆమెను చాలా దూరం పెడుతున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆమెతో ఇకపై నటించక పోవచ్చు అని కూడా అంటున్నారు.

ఆ సినిమా ఏంటీ.. ఆ హీరోయిన్‌ ఎవరు అనేది చాలా మందికి అర్థం అయ్యే ఉంటుంది. ఆ హీరోయిన్‌ కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం మరియు హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది. వచ్చిన ప్రతి ఆఫర్ ను వదులుకోకుండా ఓకే చెప్పడం వల్ల ఇతర సినిమాలకు డేట్లు ఇచ్చే విషయమై ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్లానింగ్ లేకుండా ఆమె సినిమాలకు కమిట్ అవ్వడం వల్లే ఆమె ప్రభాస్ సినిమా షెడ్యూల్‌ కు చేరుకోలేక పోయిందని పుకార్లు గుప్పుమంటున్నారు. ముందు ముందు అయినా ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఆమె చూసుకుంటుందని ఆశిద్దాం. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే రాధేశ్యామ్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సలార్‌ మరియు ఆదిపురుష్‌ లు షూటింగ్‌ శరవేగంగా జరుపుతున్నారు. ప్రాజెక్ట్‌ కే సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు దిల్‌ రాజు బ్యానర్ లో ఒక సినిమా.. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా ప్రభాస్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి


Tags:    
  • Prabhas 
  • Tollywood 
  • Actor 
  • latest news 
  • Movie News 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS