ఆ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది
అల్లు శిరీష్ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. అయినా ఇప్పటి వరకు హీరోగా మంచి కమర్షియల్ బ్రేక్ ను దక్కించుకోలేక పోయాడు. మెగా బ్రాండ్ కూడా ఆయన్ను కాపాడలేక పోతుంది. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు చిత్రాలు కొద్ది గొప్ప సక్సెస్ అయ్యాయి. కాని అవి కూడా అంతగా శిరీష్ కు స్టార్ డంను తెచ్చి పెట్టలేక పోయాయి. ఇక ఒక్క క్షణం అంటూ శిరీష్ చేసిన ప్రయోగాత్మక చిత్రం కూడా నిరాశ పర్చింది. ఆ చిత్రం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
విభిన్నమైన కథ, తప్పకుండా ఇది జనాలకు నచ్చుతుందనే ఉద్దేశ్యంతో 'ఒక్క క్షణం' చిత్రాన్ని చేశాను. సినిమా చూసిన వారు చాలా మంది బాగుంది, విభిన్నంగా ఉందని మెచ్చుకున్నారు. కాని చివరికి ఫలితం మాత్రం తారుమారు అయ్యింది. అసలు సినిమా ఫలితం తాము ఊహించిన దానికి రివర్స్ అయ్యింది. ఒక్క క్షణం ఫలితంతో చాలా డిస్సపాయింట్ అయ్యాను. సినిమా ఎక్కువ మందికి అది చేరువ కాలేక పోవడం వల్లే ఆ ఫలితం వచ్చినట్లుగా శిరీష్ చెప్పుకొచ్చాడు. ఆ సినిమా ఫలితం నుండి చాలా పాఠాలు నేర్చుకున్నట్లుగా శిరీష్ చెప్పుకొచ్చాడు.
కాస్త గ్యాప్ తీసుకుని శిరీష్ నటించిన చిత్రం 'ఏబీసీడీ'. కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శిరీష్ మలయాళంలో సూపర్ హిట్ అయిన ఏబీసీడీని తీసుకు వచ్చాడు. సంజీవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మంచి ఎంటర్ టైనర్ గా ఉంటుందనిపిస్తుంది. తప్పకుండా ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. శిరీష్ కూడా ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నాడు. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంతో శిరీష్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.