ఆ స్టార్ హీరోల ముగ్గురిలో ఉత్తముడు!

బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా దక్షిణాది దర్శకులతో సినిమాలు చేసే విషయంలో మిగిలిన స్టార్ హీరోల కంటే సల్మాన్ ఎంతో ముందున్నారు.;

Update: 2026-03-31 08:30 GMT

బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా దక్షిణాది దర్శకులతో సినిమాలు చేసే విషయంలో మిగిలిన స్టార్ హీరోల కంటే సల్మాన్ ఎంతో ముందున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులు పాన్-ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుండటంతో అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్లు తెలుగు దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఇవన్నీ లెక్కచేయకుండా సౌత్ సినిమాలకు క్రేజ్ రాకముందు నుండే ఇక్కడి దర్శకులను నమ్మి సినిమాలు చేస్తున్నారు.

ఆ విషయంలో స‌ల్మాన్ నిజంగానే `ఉత్తముడు` అని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. సల్మాన్ ఖాన్ - ప్రభుదేవా కాంబినేషన్ టాలీ వుడ్-బాలీవుడ్ బంధానికి ఓ నిదర్శనంగా చెప్పొచ్చు. వీరిద్దరి కలయికలో రిలీజ్ అయిన `వాంటెడ్` సినిమా సల్మాన్ కెరీర్‌ను మలుపు తిప్పింది. అటుపై `దబాంగ్ 3`, `రాధే` వంటి చిత్రాలతోనూ స‌త్తా చాటారు. ఓ సౌత్ డైరెక్ట‌ర్ తో మూడు సినిమాలు చేసిన బాలీవుడ్ స్టార్ గా స‌ల్మాన్ ఖాన్ కు ప్ర‌త్యేక‌మైన ఐడెంటిటీ ఏర్ప‌డింది. అలాగే కోలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్టార్ డైరెక్ట‌ర్ ముర‌గ‌దాస్ తోనూ స‌ల్మాన్ ఖాన్ ` సికింద‌ర్` సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే.

మొత్తంగా సౌత్ డైరెక్ట‌ర్ల‌తో స‌ల్మాన్ నాలుగు సినిమాలు చేయ‌డం విశేషం. వాస్త‌వానికి ఈ సినిమాలు చేస్తోన్న స‌మ‌యానికి ప్ర‌భుదేవా, ముగ‌ర‌దాస్ ప్లాప్ ల్లో ఉన్నారు. వాళ్ల‌తో సినిమాలు చేయ‌డానికి సొంత ప‌రిశ్ర‌మ హీరోలే ముందుకు రాని స‌మ‌యం అది. అలాంటి టైమ్ లో స‌ల్మాన్ ఖాన్ ముందుకొచ్చి ఇద్ద‌రికీ అవ‌కాశాలు ఇచ్చారు. కేవలం సక్సెస్ ఉన్నప్పుడే కాక‌ దర్శకుడి ప్రతిభను నమ్మి వరుస అవకాశాలు ఇవ్వడం సల్మాన్ ఖాన్ గొప్ప మనసును, నిజాయితీని చాటిచెబుతుంది. తాజాగా టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లితోనూ స‌ల్మాన్ ఖాన్ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఇంత కాలం మీడియాలోప్ర‌చారం వ‌ర‌కే ప‌రిమిత‌మైన న్యూస్ ను స‌ల్మాన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా అధికారికం చేసారు. ఈ సంద‌ర్భంలో మ‌రోసారి స‌ల్మాన్ ఖాన్ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. వంశీ పైడిప‌ల్లి టాలీవుడ్ కు ఎలాంటి విజ‌యాలు అందించాడో తెలిసిందే. `బృందావ‌నం`, `ఎవ‌డు`, `ఊపిరి`, `మ‌హ‌ర్షి` లాంటి క్లాసిక్ చిత్రాల్ని అందించిన ట్రాక్ రికార్డు వంశీ సొంతం. చివ‌రిగా కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ ను కూడా `వార‌సుడు` సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ చేసారు. అలాంటి డైరెక్ట‌ర్ కొంత కాలంగా హీరోలు దొర‌క‌క వెయిటింగ్ లో ఉన్నారు. అలాంటి స‌మ‌యంలో స‌ల్మాన్ ముందుకొచ్చారు. వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఎమోషన్స్‌ను పండించడంలో దిట్ట.

మ‌రి స‌ల్మాన్ ఖాన్ తో ఎలాంటి సినిమా చేస్తారు? అన్న‌ది చూడాలి. ప్రస్తుతం పాన్-ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, హృతిక్ రోష‌న్ లాంటి స్టార్లు ఇప్పుడు సౌత్ మేక‌ర్ల వైపు చూస్తున్నారు. వీరంద‌రి కంటే ముందే ఎలాంటి క‌ల్మ‌షం లేకుండా సౌత్ డైరెక్ట‌ర్ల‌తో మంచి ర్యాపో మెయింటెన్ చేస్తున్నాడు స‌ల్మాన్. ప్ర‌త్యేకించి టాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో స‌ల్మాన్ బాండింగ్ ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. అదే చ‌నువుతో వంశీతోనూ మూవ్ అవుతున్నారు.

Tags:    

Similar News