స్టేజ్ మీదనే కన్నీళ్లు పెట్టుకున్న ప్రముఖ హీరో

Update: 2021-11-19 04:56 GMT
తమిళ చిత్రపరిశ్రమలో ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేని అగ్రహీరోల్లో శింబు ఒకరు. అలాంటి ఆయన ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో రియాక్టు కావటం షాకింగ్ గా మారింది. ఇంతకూ ఆయనకు వచ్చిన కష్టం ఏమిటి? ఆయన్ను ఇబ్బందిపెట్టేందుకు క్రియేట్ చేస్తున్న సమస్యలు ఏమిటన్న చర్చ మొదైలంది. శింబు హీరోగా నటించి ‘‘మానాడు’’ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్ తాజాగా నిర్వహించారు.

వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీకి కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా చేస్తుంటే.. ప్రముఖ దర్శకుడు ఎస్ జే సూర్య.. చంద్రశేఖర్ లాంటి అగ్ర తారాగణం ఇందులో నటించింది. సినిమా విడుదలకు ముందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన శింబు.. సరదాగా మాట్లాడటం మొదలు పెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్న ఆయన.. ఆ తర్వాత ఒక్కసారిగా ఎమోషన్ అయ్యారు.

ఆ వెంటనే కన్నీళ్లు పెట్టుకొని తన కష్టాల్ని ఏకరువు పెట్టుకున్నారు. వెంకట్ ప్రభుతో తాను ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకున్నానని.. తాజాగా ‘మానాడు’ లైన్ చెప్పటం.. అందుకు తాను ఓకే చెప్పానన్నారు. ఈ సినిమా కోసం తానెంతో కష్టపడ్డానని.. అయితే.. ఈ సినిమాకు చాలా సమస్యల్ని క్రియేట్ చేస్తున్నారని.. వాటిని తాను చూసుకుంటానని.. కానీ తనను మాత్రం అభిమానులు చూసుకోవాలంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.

ఈ క్రమంలో వేదిక మీదనే కన్నీళ్లు పెట్టుకున్న వైనం అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. బయటకు చెప్పకున్నా.. శింబుకు ఎదురవుతున్న కష్టాలు ఏమిటన్నది ఇప్పుడు అందరిని తొలిచేస్తోంది. శింబు ఇలా బరస్ట్ కావటంతో వేదిక మీద ఉన్న ప్రముఖులు ఆయన వద్దకు వచ్చి ఓదార్చారు. మొత్తానికి శింబుకు ఎదురవుతున్న కష్టం ఏమిటన్నది ఇప్పుడు ఫజిల్ గా మారింది.
Tags:    

Similar News