'నిశ్శబ్దం' త‌రువాత ఆచితూచి అడుగులు వేస్తున్న నిర్మాణ సంస్థ...?

Update: 2020-10-16 10:10 GMT
టాలీవుడ్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్ - వివేక్ కూచిభోట్ల‌ సినిమా నిర్మిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 'ఓ బేబీ' 'గూఢచారి' 'వెంకీమామ' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్లో భాగస్వాములయ్యారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ వారు కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ తో కలిసి నిర్మించిన 'నిశ్శబ్దం' మూవీ ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి - మాధవన్ - అంజలి - షాలిని పాండే ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ మరియు సినీ విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్స్ ఇకపై సినిమాల నిర్మాణంలో ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

సందీప్ కిషన్ - లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా 'ఏ1 ఎక్స్‌ ప్రెస్' అనే చిత్రాన్ని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ - వెంకటాద్రి టాకీస్‌ సంస్థలతో కలిసి టీజీ విశ్వప్రసాద్ - వివేక్ కూచిభోట్ల‌ నిర్మిస్తున్నారు. దీంతో పాటు అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ తో కలిసి శ్రీవిష్ణు హీరోగా 'రాజరాజచోర' మరియు నిఖిల్ సిద్దార్థ్ తో 'కార్తికేయ 2' చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంతేకాకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో చందు మొండేటి దర్శకత్వంలో నివేథా పేతురాజ్ తో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయనున్నారు. అయితే ఇప్పుడు 'నిశ్శబ్దం' సినిమా తర్వాత ఇకపై సోలోగా సినిమాలు తీయాలని ఈ నిర్మాణ సంస్థ డిసైడైనట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆల్రెడీ క‌మిటైన సినిమాల‌ను భాగ‌స్వాముల‌తో కలిసి ముగించి.. ఆ త‌రువాత చేసే సినిమాలు సోలోగా చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News