ట్రైల‌ర్ కి ముందే ప‌వ‌న్ ని అలా బుక్ చేశాడ‌ట‌!

Update: 2021-03-26 12:34 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ప‌వ‌న్ మీడియా ముందుకు రాక‌పోవ‌డ‌మే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇటీవ‌లే డ‌బ్బింగ్ కూడా పూర్తి చేసేసిన ప‌వ‌న్ మునుముందు ప్రీరిలీజ్ వేడుక‌లో సంద‌డి చేయ‌నున్నారు. కానీ.. మీడియాతో ప‌ర్స‌న‌ల్ ఇంట‌రాక్ష‌న్స్ ఉంటాయా? అంటే అందుకు స‌మాధానం లేదు.

దీంతో నిర్మాత దిల్ రాజు తెలివిగా ఆయ‌న‌ను లాక్ చేసి ఇంట‌ర్వ్యూ కూడా ప్రిపేర్ చేసేశార‌ని తెలిసింది. అలా డ‌బ్బింగ్ మూడ్ లో ఉన్న ప‌వ‌న్ వ‌ద్ద‌కే యాంక‌ర్ ని ర‌ప్పించి చ‌క‌చ‌కా గంట‌లో ఇంట‌ర్వ్యూ తీసేసుకున్నార‌ట‌.

బ‌హుశా వ‌కీల్ సాబ్ రిలీజ్ ముందు అన్ని మీడియాల‌కు ఈ ఇంట‌ర్వ్యూనే రాజుగారి బృందం అందిస్తుంది. అయినా ప‌వ‌న్ మూడ్ ని అర్థం చేసుకుని తెలివిగా ఇంట‌ర్వ్యూ లాక్కున్న నిర్మాత‌గా రాజుగారి ప్ర‌తిభ‌ను మెచ్చుకోకుండా ఉండ‌లేం! అంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయ్. గంట నిడివితో ఇంట‌ర్వ్యూని ఎడిట్ చేసి సినిమా విజువ‌ల్స్ తో ఫైన‌ల్ ప్రొడ‌క్ట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది.

ట్రైల‌ర్ లాంచ్ కి మూడు రోజుల స‌మ‌యం ఉంది. ఆ త‌ర్వాత ప్రీరిలీజ్ వేడుక‌ను కొద్ది పాటి గ్యాప్ తో భారీగా ప్లాన్ చేశారు. బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ పింక్ కి రీమ‌క్ గా వ‌స్తున్న ఈ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డ‌మే ధ్యేయంగా ప‌వ‌న్ డెడికేటెడ్ గా ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. ఆదిత్య శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు - బోనీక‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Tags:    

Similar News