'వకీల్ సాబ్' లో అదొక్కటే మైనస్ అంటున్నారే..!

Update: 2021-04-10 02:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్' సినిమా భారీ అంచనాల నడుమ ఈరోజు విడుదలైంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు - శిరీష్ నిర్మించారు. 'పింక్' చిత్రానికి ఇది రీమేక్. అయితే పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఇందులో మార్పులు చేర్పులు చేసి వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ముఖ్యంగా ఇందులో హీరోయిన్‌ ను పెట్టడంతో పాటుగా లవ్ ట్రాక్‌ ను జోడించారు. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ను పవన్ కు జోడీగా పెట్టారు. అయితే 'వకీల్ సాబ్' మూవీ విడుదలైన తర్వాత శృతిహాసన్ ఎపిసోడ్  మైనస్‌ గా మారిందని టాక్ నడుస్తోంది.

'వకీల్ సాబ్' లో పవన్ కళ్యాణ్ తర్వాత లీడ్ రోల్స్ పోషించిన ప్రకాష్ రాజ్ - నివేదా థామస్ - అంజలి - అనన్య బాగా నటించారని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. అలానే అద్భుతమైన పాటలు - నేపథ్య సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు మంచి మార్కులు ఇచ్చారు. ఇక మూలకథలో చేంజెస్ చేసిన దర్శకుడు వేణు శ్రీరామ్ చక్కని ప్రతిభను కనబరిచాడని అంటున్నారు. పవన్ ని చూపించిన విధానాన్ని మెచ్చుకుంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ - శృతి హాసన్ ఎపిసోడ్ మాత్రం సినిమా ఫ్లో కి అడ్డంకిగా మారిందని.. అది లేకపోతే ఇంకా బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు. ఆ సన్నివేశాలు బలంగా లేవని మూవీ రివ్యూలలో విమర్శకులు కూడా ప్రస్తావించడం గమనార్హం. 'గబ్బర్ సింగ్' 'కాటమరాయుడు' సినిమాల తర్వాత పవన్ తో కలిసి నటించిన శృతి హాసన్ ఈసారి డిజప్పాయింట్ చేసిందని
Tags:    

Similar News