ఆ రోజు షూటింగ్ కు వెళ్లి పెద్ద తప్పు చేశా
కామెడీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకున్నాడు అల్లరి నరేష్. ఈయన హీరోగా వచ్చిన పలు సినిమాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. అయితే ఈమద్య కాలంలో అల్లరి నరేష్ కు సరైన సక్సెస్ పడలేదు. హీరోగా చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్న సమయంలో 'మహర్షి' చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. మహర్షి చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అల్లరి నరేష్ తాజాగా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అయిన సందర్బంగా అల్లరి నరేష్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో ఒకే ఒక్క రోజు షూటింగ్ లో నరకం అనుభవించాను. ఆ రోజు షూటింగ్ కు వెళ్లకుండా ఉండాల్సిందని నేను ఇప్పటికి అనుకుంటాను. నాన్నకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆ సమయంలో నేను షూటింగ్ కు వెళ్లాను. నాన్న పక్కన ఉండకుండా నేను షూటింగ్ కు వెళ్లడం నేను చేసిన పెద్ద తప్పు. నాన్నకు మరీ సీరియస్ అని నేను భావించలేదు. పైగా సీమటపాకాయ్ షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. కీలక నటీనటుల కాంబినేషన్ లో షూట్.. ఆరోజు మిస్ అయితే జయప్రకాష్ రెడ్డి గారు ఇంకా ధర్మవరపు సుబ్రమణ్యం గారు విదేశాలకు వెళ్తున్నారు. మళ్లీ తిరిగి వచ్చేందుకు టైం పడుతుంది.
అప్పటి వరకు సినిమా విడుదల ఆగాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో ఆరోజు షూటింగ్ కు వెళ్లాను. నాన్న పరిస్థితి అలా ఉండటంతో కన్నీరు వచ్చినా కూడా కామెడీ సీన్స్ చేయాల్సి వచ్చింది. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో అలాంటి పరిస్థితి నాకు రాలేదు. నాన్న చనిపోయిన సమయంలో పక్కన లేను అనే బాధ నన్ను ఎప్పటికి వేదిస్తూనే ఉంది. ఆ రోజు నువ్వు నాన్న పక్కన లేవు అంటూ అన్నయ్య ఇప్పటికి అంటూనే ఉంటే నాకు బాధగా అనిపిస్తుందని అల్లరి నరేష్ చెప్పుకొచ్చాడు.