• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మ‌జిలీ' లో ఊహించ‌ని...

'మ‌జిలీ' లో ఊహించ‌ని మ‌లుపు!

By - Tupaki Desk
Update: 2019-03-22 04:24 GMT
నాగ‌చైత‌న్య‌ - స‌మంత పెళ్లి త‌రువాత జంట‌గా న‌టిస్తున్న తొలి చిత్రం `మ‌జిలి`. ప్రేమ‌ - పెళ్లి - పెయిన్ పేప‌థ్యంలో ఓ భ‌గ్న‌ ప్రేమికుడి ల‌వ్‌ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ రూపొందిస్తున్నారు. నూత‌న నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై స‌ర్వ‌త్రా అంచ‌నాలు నెల‌కొన్నాయి. తొలి పోస్ట‌ర్ నుంచి మంచి పాజిటీవ్ టాక్‌ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బిజినెస్ ప‌రంగానూ రికార్డు సృష్టించింది. ఎమోష‌న‌ల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్ నాగాచైత‌న్య‌ - స‌మంత‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు - హార్ట్ ట‌చింగ్ డైలాగ్‌ లు.

ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో మ‌రిన్ని అంచ‌నాల‌ని పెంచేసింది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రానికి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ల‌భించే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు. `మ‌జిలీ` సినిమాపై బిజినెస్ ప‌రంగా - ఆడియ‌న్స్ వైజ్‌ గా భారీ క్రేజ్ నెల‌కొన్ని వున్న ఈ త‌ర‌ణంలో ఈ చిత్ర విడుద‌ల ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిపోయింద‌ని వార్త‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం గోపీసుంద‌ర్ అందించారు. అయితే రీ రికార్డింగ్ పూర్తి చేయ‌కుండానే వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఆయ‌న ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఏప్రిల్ 5న విడుద‌ల కావ‌డం క‌ఫ్టంగా మారింది.

అయితే గోపీ సుంద‌ర్ ఇచ్చిన షాక్ నుంచి వెంట‌నే తేరుకున్న చిత్ర బృందం యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్‌ ను సంప్ర‌దించారని - త‌ను రీరికార్డింగ్ చేయ‌డానికి ఓకే చెప్పిన‌ట్టు తెలిసింది. `తొలిప్రేమ‌` సినిమా నుంచి త‌మ‌న్ త‌న‌లోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రిస్తే వ‌రుస మెలోడీల‌ని అందిస్తున్నాడు. త‌న‌ని ఎంచుకుని `మ‌జిలీ` బృందం మంచి ప‌ని చేసింద‌ని - త‌మ‌న్ అందిస్తున్న నేప‌థ్య సంగీతం ఈ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌డం ఖాయ‌మ‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి.



Tags:    
  • Thaman 
  • Majili Movie 
  • Gopi Sunder 
  • Telugu News 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS