తమన్ వెర్సస్ తమన్ వెర్సస్ తమన్
చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు తమన్. కెరీర్ ఆరంభంలోనే చాలా మంది పెద్ద స్టార్లతో సినిమాలు చేశాడు. ఐతే మునుపటితో పోలిస్తే గత రెండేళ్లలో అతడి జోరు తగ్గింది. ఐతే ఈ మధ్య మళ్లీ తమన్ జోరందుకున్నాడు. అతడి సంగీతంలో మంచి మార్పు కూడా కనిపిస్తోంది. ‘మహానుభావుడు’ అతడి మ్యూజికల్ జర్నీలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అంతకుముందు వరకు ఎక్కువగా ఊకదంపుడు సంగీతం బండి నడిపించేసేవాడు తమన్. కానీ ‘మహానుభావుడు’తో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. మంచి మెలోడీలు.. ఫీల్ ఉన్న మ్యూజిక్ తో ఆకట్టుకుంటున్నాడతను.
కొత్త ఏడాదిలో తమన్ ఆల్రెడీ ‘భాగమతి’తో తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమాకు అతడి నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఫిబ్రవరి రెండో వారంలో తమన్ ఒకే వీకెండ్లో మూడు సినిమాలతో పలకరించబోతుండటం విశేషం. ఆ వారాంతంలో నాలుగు సినిమాలు రాబోతుండగా.. అందులో ‘కిరాక్ పార్టీ’ మాత్రమే తమన్ సినిమా కాదు. ఇంటిలిజెంట్.. తొలి ప్రేమ.. గాయత్రి.. ఈ మూడూ తమన్ సంగీతం అందించిన సినిమాలే. ఇందులో ఆల్రెడీ ‘తొలి ప్రేమ’ ఆడియో సూపర్ హిట్టయింది. ‘ఇంటిలిజెంట్’ పాటలు కూడా ఓకే అనిపిస్తున్నాయి. ‘గాయత్రి’ ఆడియో పర్వాలేదు. ఈ మధ్య బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు తమన్. ఈ మూడు సినిమాల్లో ఓవరాల్ గా తమన్ ఎలాంటి ఔట్ పుట్ ఇస్తాడో.. ఆ సినిమాలకు తన సంగీతంలో ఎలా బలంగా నిలుస్తాడో.. తనతో తాను పోటీ పడుతూ ఏ సినిమాతో పైచేయి సాధిస్తాడో చూడాలి.