తుది మెరుగులు దిద్దే పనిలో థమన్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సమ్మర్ లో విడుదల చేయాలనుకుంటే మహమ్మారి కరోనా కారణంగా విడుదలకు నోచుకోలేదు. సినిమా థీమ్ చాలా విభిన్నంగా ఉండటంతో పాటు ఇప్పటికే విడుదలైన పాట సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం ఉందని యూత్ ఆడియన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే ఈ చిత్రం తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందని యూనిట్ సభ్యులు కూడా నమ్ముతున్నారు.
సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో సినిమా పాటల విషయంలో థమన్ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన గత చిత్రాలు నిరాశ పర్చడంతో తప్పకుండా ఈసారి తేజ్ కు ఒక మంచి ఆల్బమ్ ఇస్తానంటూ థమన్ మొదటి నుండి చెబుతున్నాడు. తాజాగా సోలో బ్రతుకే సో బెటర్ ట్యూన్స్ కు తుది మెరుగులు దిద్దుతున్నాను అంటూ ట్వీట్ చేశాడు. లవ్ యూ తేజ్.. నీ ఎనర్జీ అద్బుతం అంటూ ట్వీట్ చేశాడు.
అల వైకుంఠపురంలో చిత్రంకు అద్బుతమైన ఆల్బంను అందించిన సంగీత దర్శకుడు థమన్ ఆ చిత్రం సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు. అందుకే థమన్ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. కనుక ఈ చిత్రంకు ఆయన ది బెస్ట్ ఇచ్చి ఉంటాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సుబ్బు దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా నభా నటేష్ నటించింది. పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.