ఆ ట్యూన్ కాపీ కొట్టాడు.. థమన్ పై మళ్లీ ట్రోలింగ్!
సంగీత దర్శకుడు థమన్ మరోసాారి నెటిజన్ల ట్రోల్ కు గురవుతున్నారు. గతంలో పలుమార్లు ట్యూన్లు కాపీ చేశాాడనే విమర్శలు ఎదుర్కొన్న థమన్.. తాజాగా మరోసారి నెటిజన్లకు చిక్కారు. రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను ఇటీవల విడుదల చేశారు. ‘బల్లేగా దొరికావే బంగారం..’ అంటూ మొదలయ్యే ఈ పాట.. అద్దరిపోయిందంటూ అటు రవితేజ ఫ్యాన్స్, ఇటు తమన్ అభిమానులు యమా ఖుషీ అయ్యారు. కానీ.. వారి ఆనందం వెంటనే ఆవిరైంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ఈ ట్యూన్‌ని ఓ లాటిన్ చిత్రం నుంచి కాపీ చేశారంటూ నెటిజనులు పట్టేశారు. చెప్పడమే కాకుండా.. ఒరిజనల్ ‘సెల్వా ఎల్ నియాన్’ ట్యూన్‌ని కూడా షేర్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో కాామెంట్లు..
మరోసారి అడ్డంగా దొరికిపోయావ్ థమన్ అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఒక యూట్యూబర్ అయితే ‘‘థ్యాంక్స్ అన్న. రెండు నెలలుగా కేవలం 47 మాత్రమే ఉన్న వ్యూస్.. నీ వల్ల రాత్రికి రాత్రే 17కే అయ్యాయ్’’ అని కామెంట్ చేశాడు. మరి కొందరు ‘సాంగ్ లాటిన్.. క్రెడిట్ థమన్..’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘లాటిన్ భాష కాబట్టి ఎవరూ గుర్తు పట్టరని అనుకున్నారు. కానీ అడ్డంగా దొరికిపోయాడు’ అంటున్నారు. ఇక మరి కొందరైతే.. కింగ్ సినిమాలో నాగార్జున-బ్రహ్మానందం మధ్య వచ్చే ట్యూన్ల కాపీకి సంబంధించిన కామెడీ సీన్‌తో పోలుస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు.