ఆంధ్ర.. తెలంగాణ భేదాభిప్రాయాలు ఉండవు.. క్షమించాలన్న ‘హైపర్ ఆది’

Update: 2021-06-16 04:30 GMT
బతుకమ్మ.. గౌరమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పాటు.. పలువురి ఆగ్రహావేశాలకు కారణమైన జబర్దస్త్ నటుడు హైపర్ ఆది భేషరతు.. వివాదానికి పుల్ స్టాప్ పెట్టే పని చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో చేసిన స్కిట్ పై తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ప్రతినిధులు ఫైర్ కావటం.. ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసునమోదు కావటం తెలిసిందే.

ఈ కేసు గురించి సమాచారం అందుకున్నహైపర్ ఆది.. కంప్లైంట్ చేసిన జాగృతి విద్యార్థి విభాగం ప్రతినిధులతో ఫోన్ లో మాట్లాడారు. తమ షోలో ఏం జరిగిందన్న విషయాల్ని వివరించటంతో పాటు.. కావాలని ఎలాంటి పని చేయలేదని.. నొప్పించే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన వారు భేషరతు క్షమాపణలు చెప్పే వరకు వదిలిపెట్టమని.. కావాల్సి వస్తే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

ఈ నేపథ్యంలో హైపర్ ఆది తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. తాను చేసిన స్కిట్ పై కొన్ని ఆరోపణలు వచ్చాయని.. అవన్ని కావాలని చేసినవి కావన్నారు. ఆంధ్ర.. తెలంగాణ అనే భేదాభిప్రాయాలు తమ షోలో ఎప్పుడూ కనిపించవన్న ఆది.. అన్ని ప్రాంతాల వారి ప్రేమ.. అభిమానంతోనే తాము వినోదం పంచుతున్నట్లు చెప్పారు. ఇటీవల షోలో జరిగిన దానికి అందరి తరఫున క్షమాపణలు కోరుతున్నట్లు ప్రకటించి వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. 
Tags:    

Similar News