ఆర్టిస్టుల సంఘం నిధుల దుర్వినియోగం?
తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘం (TMTAU) టాలీవుడ్ లోనే అతి పెద్ద ఆర్టిస్టుల సంఘంగా అవతరిస్తోందా? దాదాపు 800 మంది ఆర్టిస్టులు ఉన్న మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)కి ధీటుగా ఎదుగుతోందా? అంటే అవుననే తాజా సమాచారం. తెలుగు సినీపరిశ్రమ మనుగడకు చిహ్నంగా నిలిచిన మూవీ ఆర్టిస్టుల సంఘం(మా) దశాబ్ధాల పాటు ప్రాపకంలో ఉంది. అయితే టీఎంటీఏయూ పేరుతో దాదాపు ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ కొత్త అసోసియేషన్ అత్యంత వేగంగా ఎదిగేస్తూ 700 మందితో పురోగమిస్తోంది. ఆ క్రమంలోనే అందులో వివాదాలు బయటపడడడం తాజాగా చర్చకు వచ్చింది. ప్రస్తుతం శివశంకర్ అధ్యక్షుడిగా ఉన్న టీఎంటీఏయూ పాలనా విధానంపై ఆర్టిస్టుల్లో ఆసక్తికర డిబేట్ రన్ అవుతోంది.
దాదాపు 700 మంది పైగా ఆర్టిస్టులు ఉన్న ఈ రిజిస్టర్డ్ ఫర్మ్ లో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని.. ఈ సంఘానికి సరైన బైలాస్ ని రూపొందించలేదని తీవ్ర విమర్శలు సభ్యుల నుంచే రావడం చర్చకు వచ్చింది. ఇక మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) తరహాలోనే ఈ ఆర్టిస్టుల సంఘంలోనూ అధ్యక్ష కార్యదర్శుల మధ్య గొడవలు బయటపడడం సర్వత్రా ఆసక్తికర చర్చకు తావిచ్చింది. ఈ సంఘానికి రాంబాబు కంచకర్ల ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయనకు అధ్యక్షుడు శివశంకర్ కు మధ్య విభేధాలు పొడచూపడం.. అలాగే గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు వివాదాలకు తావివ్వడం వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే టీఎంటీఏయూకి తొందర్లోనే ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీని ఫామ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ అసోసియేషన్ పూర్వాపరాలు పరిశీలిస్తే.. 2012-2016 పూర్వం వరకు ఇందులో చేరిన సభ్యుల సంఖ్య 327. కేవలం ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో చేరిన సంభ్యుల సంఖ్య 390. అయితే రాబోవు ఎన్నికల్లో పాత వాళ్లు సీనియర్లను కమిటీకి ఎంపిక చేస్తారా.. లేక కొత్త వాళ్లకు ప్రాతినిధ్యం ఇస్తారా? అంటూ మరో ఆసక్తికర డిబేట్ సాగుతోంది.
ఇక కీలకమైన జనరల్ బాడీ మీటింగులకు సభ్యులు స్పందించకపోవడంపైనా చర్చ సాగుతోంది . 2016 కు ఏ మీటింగ్ నిర్వహించిన సభ్యుల హాజరు శాతం130 -150 లోపే. ఇప్పుడు కొన్ని సమావేశాలకు 270 మంది హాజరవుతున్నారు. అంటే ఓ140 మంది కొత్త వారు యాక్టివ్ గా ఉన్నారు. ఎన్నికల కు సమారు 250-350 సభ్యులు ఓటింగ్ కి అటెండయ్యే అవకాశం ఉందని ఎన్నికల వేళ అంచనా వెలువడింది. ప్రస్తుత పాలక వర్గం ఐక్యత యూనియన్ కు మార్గ నిర్థేశనం కానుంది. మరీ ముఖ్యంగా అందరూ ప్రక్షాళనకు సుముఖంగా ఉన్నారు కాబట్టి ఈ కమిటీ మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చా సాగుతోంది.
ఇక ఈ యూనియన్ లో అపారానుభవం కలిగిన ఆడిటర్ కం ఆర్టిస్టులు ఉన్నారు. వారితో బైలాస్ లో మంచిచెడు నిర్ణయిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బైలా రెడీగా ఉంది. జనరల్ బాడీ లో దీనిని అమోదించేందుకు ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని యూనియన్ లో కీలక పదవులైన ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవుల కోసం యూనియన్ కోసం పోరాటం చేస్తున్న వారి ఆధ్వర్యంలో బలమైన కమిటీ కి రూపకల్పన చేయాలని ప్లాన్ చేస్తున్నారు. యూనియన్ పుట్టి ఏడు సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇక అసోసియేషన్ లో పలువురి మధ్య విభేదాలు ఈ ఎన్నికల సందర్భంగా రచ్చకెక్కుతున్నాయి. గ్రూప్ అధ్యక్షుడు శివశంకర్.. అతడిని వ్యతిరేకిస్తున్న ప్రధాన కార్యదర్శి రాంబాబు రకరకాల వాట్సాప్ గ్రూప్ లు క్రియేట్ చేసి రాజకీయాలు చేయడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.