వృద్ధాప్యాన్ని ఆపే టెక్నిక్ చెబుతాన‌న్న శ‌ర్మా గాళ్

Update: 2021-01-27 02:30 GMT
వృద్ధాప్యం మ‌ర‌ణం అనేవి లేకుండా జీవించేందుకు దేవ‌త‌లు అమృతం తాగారు. ఆ అమృతాన్ని రాక్షసుల‌కు అంద‌కుండా చేశారు. అదంతా పురాణేతిహాసాల్లో చెప్పుకున్న క‌థ. కానీ నేటి మోడ్ర‌న్ క‌ళియుగంలోనూ వృద్ధాప్యం అన్న‌దే ద‌రి చేర‌నీకుండా చేసేస్తాన‌ని డాంబికాలు ప‌లుకుతోంది శ‌ర్మా గాళ్.

ఈ భామ లైట్ థెర‌పీని ప్రిఫ‌ర్ చేస్తుంద‌ట‌. ఇదిగో తాజాగా ఇన్ స్టా వేదిక‌గా ఈ థెర‌పీకి ప్ర‌చారం చేసి పెడుతోంది. యువి కిర‌ణాల వ‌ల్ల శ‌రీరం దెబ్బ‌ తింటోంది. నిరంత‌రం సెల్ ఫోన్లు ల్యాప్ టాప్ లు స‌హా ర‌క‌ర‌కాల ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల్ని ఉప‌యోగించే ఆధునిక జీవుల‌కు వాటివాల్ల ఎంతైనా హాని పొంచి ఉంది. అయితే అన్నిటికీ చెక్ పెట్టాలంటే లైట్ థెర‌పీ  ఒక్క‌టే మార్గం అని చెబుతోంది ఐషా శ‌ర్మ. ‘టెక్ డ్యామేజ్’ ని HEV బ్లూ లైట్ ని ఆపే ప‌రిక‌రం ఇది.. అంటూ ప్ర‌చారం ఊద‌ర‌గొడుతోంది.

మన చర్మంలోకి చొచ్చుకుపోయి లైన్స్.. హైపర్ పిగ్మెంటేషన్ .. వృద్ధాప్యాన్ని వేగవంతం చేసేది బ్లూ లైట్. నిజాయితీగా చెప్పాలంటే నేను నా సెల్ ఫోన్ ముందు సమయం గడపడం నా మెడకు నష్టం కలిగించింది. సాధారణంగా మ‌నం మెడ డెకోల్లెటేజ్ ‌ను విస్మరిస్తాము. నేను ఇందులో దోషినే.

లైట్ థెరపీకి అపారమైన ప్రయోజనాలు ఉన్నాయి. మీ స్కిన్ టోన్.. రక్త ప్రవాహం పెరుగుదల‌కు ఇది సరైన R n R. చర్మ సంరక్షణ కోసం మీరు నన్ను క్రమం తప్పకుండా అనుసరించండి. నేను లైట్ సెలూన్ ఫేస్ మాస్క్ కి అభిమానిని. చర్మ సంరక్షణ సాధనంలో పెట్టుబడి పెట్టండి. మీరు ఫలితాలను చూస్తారు. చర్మ సంరక్షణ నిపుణుడు చెప్పేది కాదు.. నా స్వంత నిజాయితీ అనుభవం ఇది అంటూ తెగ గ‌ట్టిగానే చెప్పింది.

అంతా బాగానే ఉంది కానీ.. ఈ ప‌రిక‌రం ధ‌ర ఎంతో కూడా తెలుసుకునే కొనుగోలు చేయాల్సి ఉంటుందేమో. అయినా వృద్ధాప్యాన్ని ఆపే టెక్నిక్ దీంతో సాధ్యం అయితే డిమాండ్ కూడా ఆ రేంజులోనే ఉంటుంది మ‌రి. ఐషా శ‌ర్మ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో పెద్ద కెరీర్ ని ఆశిస్తోంది. ఇన్ స్టా వేదిక‌గా సోద‌రి నేహా శ‌ర్మ‌తో క‌లిసి వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. అవ‌న్నీ వైర‌ల్ అవుతున్నాయి. సోష‌ల్ మీడియాల్లో ఫాలోవ‌ర్స్ పెరిగిన క్ర‌మంలో ఇలా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో బాగానే ఆర్జిస్తోంది.
Tags:    

Similar News