టీజర్ టాక్ : సంజయ్..అనుపమ జస్ట్ ఫ్రెండ్స్ అంతే!
'అష్టా చమ్మా' మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు శ్రీనివాస్ అవసరాల. ఆ తరువాత నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగా 'ఊహలు గుసగుసలాడే' పరిచయమై తొలి చిత్రంతో ప్రశంసలు దక్కించుకున్నారు. ఆ తరువాత 'జ్యో అచ్యుతానంద' అంటూ మరో ప్రేమకథని అందించి శభాష్ అనిపించుకున్న అవసరాల శ్రీనివాస్ కొంత విరామం తరువాత ముచ్చటగా మూడవసారి మెగా ఫోన్ పట్టారు. ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'.
విచిత్రం ఏంటంటే ఇంత వరకు శ్రీనివాస్ అవసరాలు రూపొందించిన రెండు సినిమాల్లోనూ నటించిన నాగశౌర్య ముచ్చటగా మూడవ సినిమాలోనూ కథానాయకుడిగా నటిస్తున్నారు. మాళవిక నాయర్ హీరోయిన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రెండవ సారి నాగశౌర్య తో మాళవిక నాయర్ కిది రెండవ సినిమా.
వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రధాన హైలైట్ గా అవసరాల తన మార్కు కామెడీ ఎమోషన్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ని శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. 'ఇందు మూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా సంజయ్ పీసపాటి మరియు అనుపమ కస్తూరి బెస్ట్ ఫ్రెండ్స్ అహో..' అంటూ హీరోయిన్ డైలాగ్ తో టీజర్ మొదలైంది. పాత్రలకు అవసరం అయితే ఎక్స్ పోజింగ్ కూడా చేస్తా.. అని హీరో..పెళ్లైన తరువాత కూడా నటిస్తా.. అంటూ హీరోయిన్ కౌంటర్ ఇవ్వడం.. నాకూ అనూకి మధ్య అలాంటిది ఏమీ లేదు..వీ ఆర్ జెస్ట్ ఫ్రెండ్స్..
అంటూ హీరో చెబుతూనే హీరోయిన్ ని లిప్ లాక్ చేయడం.. నా దగ్గర పాతవి ఏమీ లేవు.. అన్ని డిస్పోజ్ చేసేశాను' అంటూ హీరోయిన్ చెప్పడం.. ఇద్దరి మధ్య సాగే గిల్లికజ్జాల నేఫథ్యంలో ఈ మూవీని శ్రీనివాస్ అవసరాలు ఓ ప్లజెంట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ మూవీకి కల్యాణీ మాలిక్ సంగీతం అందించారు. సినిమా నేపథ్యానికి తగ్గట్టే కల్యాణీ మాలిక్ సంగీతం ప్రాణం పోసినట్టుగా వుంది. ఓ ప్రేమ జంట జీవితంలోని మూడు దశలలో సాగే కథగా ఈ సినిమా వుంటుందని తెలుస్తోంది.
సీరియస్ గా సాగుతూనే అవసరాల మార్కు కామెడీని పంచుతున్నాయి. టీజర్ ని బట్టి చూస్తుంటే సినిమా ఆడియన్స్ కి ఫ్రెష్ లవ్ స్టోరీని చూస్తున్న ఫీల్ ని కలిగిస్తుందని తెలుస్తోంది. మన పక్కింటి అబ్బాయి, అమ్మాయి ప్రేమ కథగా అనిపిస్తున్న ఈ మూవీని మార్చి 17న విడుదల చేస్తున్నారు. ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ టీజర్ ఇప్పటికే వన్ మిలియన్ ని క్రాస్ చేయడం విశేషం. ఈ సినిమాకు వివేక్ కూచీభోట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View