ఊక వేస్తే రాలనంత మంది.. 'పెద్ది' భోపాల్ ఈవెంట్ క్రేజ్!
కానీ ఇప్పుడు ఏకంగా ఉత్తరాది రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో జరిగిన 'పెద్ది' సినిమా మెగా ఈవెంట్ చూశాక.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అందరికీ అర్థమవుతోంది.
హైదరాబాద్ లేదా దక్షిణాది నగరాల్లో ఒక మెగా ఈవెంట్ జరిగితే అభిమానుల రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఏకంగా ఉత్తరాది రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో జరిగిన `పెద్ది` సినిమా మెగా ఈవెంట్ చూశాక.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అందరికీ అర్థమవుతోంది. భోపాల్ వేదికగా ఒక భారీ ఓపెన్-ఎయిర్ సెలబ్రేషన్‌గా ప్లాన్ చేసిన `పెద్ది కి ఆవాజ్` కార్యక్రమానికి ఊక వేస్తే రాలనంత జనసందోహం తరలివచ్చింది. కేవలం రామ్ చరణ్ క్రేజ్‌ను మాత్రమే కాకుండా.. సినిమా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపై మధ్యప్రదేశ్ ప్రజలకు ఉన్న విపరీతమైన ఆసక్తిని కూడా ఈ వేడుక స్పష్టంగా నిరూపించింది.
ఈ గ్రాండ్ భోపాల్ ఈవెంట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే వేదిక పరిసరాలన్నీ వేలాది మంది అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఈ ఈవెంట్‌కు సంబంధించిన పాసులు, టికెట్లు ముందే పూర్తిగా సోల్డ్ అవుట్ అవ్వడం రామ్ చరణ్ పాన్-ఇండియా స్టార్‌డమ్‌కు నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం హాజరై సందడి చేశారు. వేదికపై రామ్ చరణ్‌ను.. అలాగే ఈ సినిమా కోసం ఆయన డిజైన్ చేసుకున్న సరికొత్త `పెద్ది` లుక్‌ను చూసి ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇటు నార్త్ ఆడియన్స్‌ను కూడా ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తుందో ఈ వేడుక సాక్షిగా అర్థం చేసుకోవచ్చు.
ప్రమోషన్ల పరంగా ఇటీవలి కాలంలోనే అత్యంత భారీ ఈవెంట్‌గా నిలిచిన ఈ వేడుకలో `పెద్ది` చిత్రబృందం మొత్తం పాల్గొని అభిమానుల్లో సరికొత్త జోష్ నింపింది. ఇక రెహమన్ లైవ్ షో గురించి ముందే తెలియడంతో బోపాల్ యూత్ మొత్తం ఈ వేదిక వద్ద ఎగబడ్డారు.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నార్త్ మార్కెట్‌ను ఏ విధంగా శాసించబోతున్నాడో ఈ జంట ఫ్యాన్ బేస్ చూస్తేనే అర్థమవుతోంది. సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో మేకర్స్ ప్లాన్ చేసిన ఈ భోపాల్ ఈవెంట్ స్ట్రాటజీ వందకు వంద శాతం సక్సెస్ అయిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సౌత్ సినిమాలకు నార్త్ బెల్ట్‌లో లభిస్తున్న ఆదరణకు ఈ భోపాల్ ఈవెంట్ ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా.. దేశంలోని నలుమూలలా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఉన్న తిరుగులేని క్రేజ్ ఉందని ప్రూవ్ అయింది. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చాక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందో చూడాలని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.