మెగా బ్రదర్స్ కి అంజలి భర్తే విలన్

Update: 2016-12-22 13:29 GMT
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఖైదీ నంబర్ 150 ఇప్పటికే షూటింగ్ పూర్తయిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తన కాటమరాయుడు మూవీని జెడ్ స్పీడ్ లో ఫినిష్ చేసేస్తున్నాడు. జనవరి చివరికల్లా కాటమరాయుడు కంప్లీట్ కానున్నాడంటే.. పవన్ స్పీడ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.

ఇప్పుడీ రెండు సినిమాలకు ఓ పోలిక కుదిరింది. అన్నాదమ్ములు ఇద్దరూ ఒకే విలన్ తో తలపడుతున్నారు. ఖైదీ నంబర్ 150లో విలన్ తరుణ్ అరోరా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాటమరాయుడులో కూడా ఇతడినే మెయిన్ విలన్ గా ఫైనల్ చేశారట. అన్నాదమ్ములిద్దరూ ఒకే విలన్ ని తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ ఈ తరుణ్ ఎవరో కాదు.. అప్పట్లో చిరుతో కలిసి చూడాలని ఉంది అంటూ తెగ సందడి చేసేసిన అంజలా జవేరి భర్తే ఈ తరుణ్ అరోరా.

అలనాటి హీరోయిన్ లైఫ్ పార్ట్నర్ తో అన్నయ్య ఢీ కొట్టి ఓడిస్తుంటే.. పవర్ స్టార్ కూడా అదే విలన్ ని ఓడించబోతున్నాడన్న మాట. ఇక చిరు మూవీ ఖైదీ నంబర్ 150 పొంగల్ సందర్భంగా విడుదల కానుంటే.. పవన్ కళ్యాణ్ 2017 ఉగాది పండుగకు ఫిక్స్ అయిపోవడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News