ఫస్ట్ లుక్: పిల్లోడు భయపెట్టేస్తున్నాడే!!

Update: 2016-10-24 13:27 GMT
ముందు చైల్డ్ ఆర్టిస్ట్. కుదిరితే హీరోగా. తరువాత విలన్ గా. ఆ తరువాత క్యారక్టర్ వేషాలు. కొంతమంది కుర్రాళ్ళ టైమ్ ఇలా నడుస్తూ ఉంటుంది. అదిగో ఇప్పుడు ఆ మూడో ఫేస్ లోకే అడుగుపెట్టాడు తనీష్‌. అయితే మనోడు నాలుగో ఫేస్ కు వెళతాడో లేదో తెలియదు కాని.. ఖచ్చితంగా మూడో ఫేజ్లో మాత్రం మూడు చెరువుల నీళ్ళు తాగిస్తా అంటున్నాడు.

చిన్నప్పుడు క్యూట్ లుక్ తో అలరించిన తనీష్‌.. హీరో అయ్యాక కూడా నచ్చావులే అండ్ రైడ్ వంటి హిట్టు సినిమాలు చేశాడు. ఆ తరువాత మాత్రంఎందుకో మనోడికి ఆదరణ అండ్ అవకాశాలు రెండూ తగ్గాయ్. బహుశా బాగా లావెక్కిపోవడం కూడా తనీష్‌ కు ఒక మైనస్సే. అయితే ఇప్పుడు సడన్ గా విలనీయం అంటున్నాడు ఈ కుర్రాడు. కృష్ణవంశీ తీస్తున్న ''నక్షత్రం'' సినిమాలో మనోడు విలన్ గా మారిపోయాడు. పైగా ఫస్ట లుక్ పోస్టర్లో చూస్తుంటే.. ఆ పెట్టుడు పిల్లి కళ్ళతో భయపెట్టేస్తున్నాడు.

మరి విలన్ గా అయినా తనీష్‌ కు పెద్ద బ్రేక్ వస్తుందా? లేదంటే ఒక్క సినిమాలో విలన్ గా చేసి బ్రేక్ తెచ్చేసుకుని.. ఆ తరువాత మనోడు మరోసారి హీరోగా హవా చూపిద్దాం అనుకుంటున్నాడా? లెటజ్ సీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News