అనాధ శరణాలయాలు.. తనికెళ్ళ పంచులు

Update: 2016-07-23 15:30 GMT
'అసలు కొందరు పిల్లలు వృద్దాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులను అనాథ శరణాలయాలు.. ఓల్డేజ్ హోమ్ లో ఎందుకు జాయిన్ చేస్తున్నారు అంటారు?' అంటూ ప్రశ్న అడిగిన రైటర్ తనికెళ్ళ భరణికి.. అనుకోని ఒక పంచ్ పడింది. ఆ దెబ్బతో కొందరు పిల్లలు చేస్తుంది కూడా నిజమే అనే భావనకు వచ్చేశారు ఆయన. ఇంతకీ ఆ పంచ్ ఏంటి?

ఒకనాడు ఒక అనాథ శరణాలయం ప్రోగ్రాముకు వెళ్ళి.. 'ఒక అనాథ శరణాలయం వృద్దిలోకి రావడం అంటే అది మూతపడటమేనని.. అలా మూతపడి అనాథలు తగ్గితేనే కదా.. అనాథాశ్రమాలు వృద్దిలోకి రావడం' అంటూ పరాచికాలు ఆడారంట తనికెళ్ళ. వెంటనే అక్కడి ఆడియన్సులో ఒక కుర్రాడు లేచి.. ''అయ్యా.. నన్ను 2వ తరగతిలో హాస్టల్లో జాయిన్ చేశారు. మళ్ళీ నేను ఇంటర్ తరువాతే బయటకొచ్చాను. అందుకే ఇప్పుడు మా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి వారిని అనాథశ్రమంలో జాయిన్ చేస్తున్నాం'' అన్నాడట. తనికెళ్ళకు ఒక్కసారిగా షాక్‌ కొట్టినట్లయిందట.

కాస్త ఆలోచిస్తే.. చిన్నప్పుడు హాస్టల్లో జాయిన్‌ చేసి పిల్లల బాల్యం కట్‌ చేసినందుకు.. ఇప్పుడు వారు పెద్దల వార్దక్యాన్ని కట్ చేస్తున్నారు.. అంటున్నారు ఈ సీనియర్ రైటర్ కమ్ యాక్టర్. నిజానికి పెద్దలు పిల్లల్ని బాగా పెంచితే.. పిల్లలు పెద్దయ్యాక సరైన దారిలో నడుస్తారు అంటూ చెబుతున్నారు తనికెళ్ల. అది సంగతి.
Tags:    

Similar News