పశువులున్న చోట ఆటవిక న్యాయమే కరెక్ట్ !

Update: 2019-12-06 11:19 GMT
 దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతం ..అంతే ఉత్కంఠతతో ముగిసింది. దిశ ఘటన జరిగిన తరువాత ఆఘమేఘాలపై స్పందించిన పోలీసులు ..24 గంటల్లోనే నిందుతులని పట్టుకోగలిగారు. ఆ తరువాత వారిని వెంటనే ఉరి తీయాలంటూ దేశ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనల కార్యక్రమం నిర్వహించారు. ఆ పై ఆ నలుగురి నిందుతులని కోర్టులో ప్రవేశపెట్టి ..అక్కడినుండి చర్లపల్లి జైలుకి తరలించారు. జైల్లో ఉన్న నిందుతులని పోలీసులు ఈ నెల 4 వ తేదీన కస్టడీలోకి త్సినుకున్నారు. ఇక కేసు విచారణ లో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయడానికి నిందితులని , ఘటనా స్థలానికి తీసుకోని వెళ్లగా ..అక్కడ ఆరిఫ్, చెన్నకేశవులు పోలీసుల వద్ద నుంచి గన్‌లు లాక్కొని పోలీసుల మీదే కాల్పులు జరిపారు. దీనితో గత్యంతరం లేక పోలీసులు వారి పై కాల్పులు జరపడంతో వారు అక్కడిక్కడే మరణించారు. ఉదయం 5.45 నుంచి 6.15 మధ్య దిశ హంతకుల ఎన్‌కౌంటర్ జరిగింది అని సీపీ సజ్జనార్ చెప్పారు.

ఇకపోతే ఈ నిందుతులని పోలీసులు ఎన్ కౌంటర్ చేసారు అని తెలిసినప్పటి నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ ..పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ ఘటన పై టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ,  రచయిత తనికెళ్ళ భరణి గారు స్పందించారు. "ఒక మహిళను ఎత్తుకెళ్ళిపోయినందుకు రామాయణం జరిగింది.. అలాగే ఒక స్త్రీని అవమానించినందుకు మహాభారతం జరిగింది .. ఇక ఇవాళ ఒక దిశ నిర్దేశం జరిగింది. డాక్టర్ దిశను తలుచుకుంటేనే ఆవేదన వస్తోంది.. అసలు ఇలా జరగకూడదు. ఇది ఆటవిక న్యాయం. కానీ ఇలాంటి సమాజంలో పశువులు ఉన్న చోట ఆటవిక న్యాయమే కరెక్ట్ ఏమో.. ఇప్పటికైనా ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలుగుతుంది అని, పోలీసులకు నమస్కారాలు తెలియజేస్తున్నా" అని ఓ వీడియో ద్వారా తన మనసులోని బాధను అయన చెప్పారు. 
Tags:    

Similar News