• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమన్నాను 100 సార్లు...

తమన్నాను 100 సార్లు ఎత్తుకున్నాడట

By - Tupaki Desk
Update: 2018-05-07 04:19 GMT
కళ్యాణ్ రామ్.. తమన్నా జంటగా నటిస్తున్న మూవీ 'నా నువ్వే'. కంప్లీట్ గా లవ్ స్టోరీ థీమ్ తోనే ఈ సినిమా రూపొందింది. ఈ నెల 25న విడుదల అవుతున్న నా నువ్వే చిత్రానికి ఇఫ్పుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించారు. జయేంద్ర లాంటి గ్రేట్ ఫిలిం మేకర్ మూవీలో తాను నటించడమే అదృష్టం అంటోంది మిల్కీ బ్యూటీ.

'మొదట ఆయన కథ చెప్పడానికి పిలిచినపుడు.. నేను అమెరికా నుంచి 22 గంటలపాటు జర్నీ చేసి వచ్చాను. ఆయన చెబుతుంటే నా కళ్లు మూతలు పడిపోతున్నాయి. అయినా సరే ఆయన చెబుతున్న కథ మనసులోకి వెళ్లిపోతోంది. నన్ను ఓ చిన్నపిల్లలాగా ట్రీట్ చేసి నిద్ర లేపి వెయిట్ చేసి మరీ స్టోరీ వినిపించారు జయేంద్ర. అలాంటి గొప్ప దర్శకుడితో పని చేయడం అదృష్టం. ఈ సినిమాకు పీసీ శ్రీరామ్ కెమేరా వర్క్ ఇంకా పెద్ద ఆకర్షణ అని మీకు ఈపాటికే అర్ధమైందని నాకు తెలుసు' అంటోంది తమన్నా.

ఈ సారి తాను కొంచెం ఎక్కువే మాట్లాడుతా అని తన స్పీచ్ మధ్యలోనే చెప్పిన తమన్నా.. 8 నిమిషాలకు పైగా మాట్లాడగా.. వీలైనంత ఎక్కువగా తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నించింది. 'చినికి చినికి పాట చిత్రీకరించే సమయంలో నాకు ఫీవర్. ముక్కులు కూడా కారిపోతున్నాయి. కేవలం పీసీ సార్ వర్క్ చేయబట్టే ఈ పాటను నేను పూర్తి చేయగలిగాను. ఆ పాట అయ్యేసరికి కళ్యాణ్ రామ్ కు ఎందుకు జలుబు చేయలేదు అని ఆశ్చర్యం వేసింది' అంటూ నవ్వేసింది తమన్నా.

ఎంతో సహకరించే కోస్టార్ కళ్యాణ్ రామ్ అని చెప్పిన తమన్నా.. తనను కనీసం ఓ వంద సార్లు లిఫ్ట్ చేసి ఉంటాడని.. దానికి ముందు మేల్ డ్యాన్సర్ ను ఇంకా ఎక్కువ సార్లు లిఫ్ట్ చేసి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందని.. కళ్యాణ్ రామ్ డెడికేషన్ అలా ఉంటుందని చెప్పింది తమన్నా. శరత్ అందించిన సంగీతం ప్రతీ ఒక్కరి మనసులను తడుతుందని అంటోంది తమ్మూ.
Tags:    
  • Tamanna 
  • Kalyan Ram 
  • Naa Nuvve Audio Launch 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS