మా కార్‌ బాడీ మసాజ్‌ చేస్తోంది -మిల్కీ

Update: 2016-02-05 15:30 GMT
ఈ మధ్య హీరోయిన్లు ఎలాంటి కామెంట్లు చేస్తున్నారో చూస్తే.. వీళ్ళు ఇంత జోవియల్‌ గా షూటింగ్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నారా అనే సందేహం రాక మానదు. అదిగో.. ఈరోజు ఉదయం షూటింగ్‌ కు వెళుతూ మిల్కీ సైరన్‌తమన్నా కూడా సేమ్‌ ఇలాగే చాలా విషయాలు చెప్పింది. పదండి ఓ లుక్కేద్దాం.

ప్రస్తుతం తమిళంలో విజయ్‌ సేతుపతి సరసన దర్మదురయ్‌ సినిమాలో నటిస్తోంది మిల్కీ సైరన్‌. ఈరోజు ఉదయం ఈ సినిమా యునిట్‌ అంతా మధురై దగ్గర్లోని ఒక వాటర్‌ ఫాల్‌ దగ్గర షూటింగ్‌ నిమిత్తం బయలుదేరారు. అయితే దారంతా కూడా గతుకులు గుంతలే. ఒక కార్లో వెళుతున్నా కూడా ఒళ్ళంతా అదిరిపోయేంత ఒత్తిడి. దీని గురించి మాట్లాడుతూ.. ''మా కార్‌ మాకు ఎలా బాడీ మసాజ్‌ చేస్తోంది చూడండి'' అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.

మొత్తనికి తెలుగులో చకచకా రెండు సినిమాలు చేసేస్తే వచ్చిన క్రేజుతో ఇప్పుడు తమిళంలో కూడా తమన్నా బాగానే ఛాన్సులు పట్టేస్తోంది. ఇలాంటి కార్‌ మసాజ్‌ లతో అమ్మడి పేరు ఇంకా మారుమోగిపోతోంది.
Tags:    

Similar News