'మహా సముద్రం'లోకి టాలెంటెడ్ హీరోయిన్...!
'Rx 100' మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి.. ఇటీవల ''మహాసముద్రం'' అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మల్టీస్టారర్ మూవీలో వర్సటైల్ యాక్టర్ శర్వానంద్ మరియు 'బొమ్మరిల్లు' సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన అనౌన్స్ మెంట్ ఇచ్చారు. టాలెంటెడ్ హీరోయిన్ అదితి రావు హైదరి ఈ మూవీలో హీరోయిన్ గా నటించబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
'మహాసముద్రం'లో నటనకు స్కోప్ ఉన్న ఈ పాత్ర కోసం అనేకమంది హీరోయిన్స్ ని అనుకున్న తర్వాత చివరకు అదితి రావు హైదరి అయితేనే న్యాయం చేస్తుందని ఆమెను ఫైనలైజ్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు అదితి కూడా ఈ ప్రాజెక్టులో భాగం అయినందుకు సంతోషంగా ఉందని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుందని సమాచారం. మేకర్స్ త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.