ఫోటో స్టొరీ: మెగా స్టార్ రీల్ అయితే.. ఈయన రియల్

Update: 2019-02-22 11:09 GMT
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భారీ బడ్జెట్ పీరియడ్ మూవీ 'సైరా' లో నటిస్తున్నారు. తొలి తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమాలో నరసింహారెడ్డిగారి పాత్రలో చిరు నటిస్తున్నారు.

బ్రిటిష్ వారిపై వీరోచితంగా పోరాడి వారి కంటికి కునుకు లేకుండా చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తిరుగుబాటుదారుడిగా ప్రకటించి ఫిబ్రవరి 22 తారీఖు 1847 న ఉరితీయడం జరిగింది. ఈ రోజు ఆయన వర్ధంతి.  ఈ సందర్భంగా 'సైరా' టీమ్ నరసింహారెడ్డిగారి రియల్ ఫోటోను విడుదల చేశారు.   నల్లకోటు.. తెలుగుదనం ఉట్టిపడే పంచె.. తలపాగా .. మెడలో హారం.. చేతిలో కత్తితో.. కాళ్ళకు అయన దర్పాన్ని ప్రతిబింబించే చెప్పులు ధరించిన ఆయన అసలు సిసలైన జమిందార్ లాగా ఉన్నారు.  మెలిదిప్పిన మీసాలు ఆయన పౌరుషాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

భారతదేశానికి మొదటగా కెమెరా 1855 లో వచ్చిందని మనకు అధికారికంగా రికార్డ్స్ లో ఉంది కానీ.. నిజానికి బ్రిటిష్ వారు 1830 లలోనే ఫోటోగ్రఫీని ఇండియాకు పరిచయం చేసినట్టు ఈ ఫోటోతో మనకు అర్థం అవుతుంది.  అప్పట్లోనే స్టైలిష్ గా ఫోటో తీయించుకున్నారంటే ఆయన దర్జా ఎలాంటిదో అర్థం కావడం లేదూ..?
Tags:    

Similar News