మర్చిపోయిన కత్తిసాము మళ్ళొచ్చింది!!

Update: 2015-07-13 05:35 GMT
అలనాటి మేటి క్లాసిక్స్‌లో కాంతారావు మొదలు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, హరనాథ్‌, కృష్ణ వంటి ఎందరో కత్తి పట్టి ఫేమస్‌ అయ్యారు. కత్తి తిప్పడంలో స్పెషలిస్టు కాబట్టి కాంతారావుని కత్తి కాంతారావుగా పాపులర్‌ చేసేశారు. అయితే అలనాటి మేటి జానపద చిత్రాల్లో ఇవన్నీ కనువిందు చేసేవి.

ఇటీవలి కాలంలో అసలు కంటికి కత్తి యుద్ధాలే కరువయ్యాయి. అపుడెపుడో భైరవ ద్వీపం చిత్రంలో బాలకృష్ణ కత్తి తిప్పి కొన్ని అద్భుత విన్యాసాలు చేసి చూపించాడు. మధ్యలో వార్‌ నేపథ్యంలో సినిమాలే రాక కత్తిని తెలుగువాడి కన్ను మిస్సయ్యింది. అయితే సాంఘీక, రాజకీయ నేపథ్యం ఉన్న ఈ చిత్రాల్లో కత్తి కనిపిస్తుంది కానీ కత్తి ఫీట్‌ అద్భుతంగా కనిపించదు. ఇటీవలి కాలంలో మాస్‌ రాజాలైన ఎన్టీఆర్‌, రవితేజ, చరణ్‌, బన్ని వీళ్లంతా కత్తి పట్టారు. విలన్‌ని చిత్తు చేశారు. కానీ ఏం లాభం వాటిని డామినేట్‌ చేస్తూ తుపాకులు పేలాయి. అందువల్ల కత్తిని ప్రత్యేకించి గుర్తించిందేం లేదు.

పవన్‌ ఖుషీలోను, ప్రభాస్‌ మిర్చిలోను కత్తి తిప్పారు.. కానీ ఏం లాభం. ఆ కత్తులేవీ ఇప్పుడు గుర్తుకు రావడం లేదు. కానీ ఇప్పుడు ఓ కత్తి మాత్రం ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోతోంది. అదే బాహుబలి కత్తి. అసలు కత్తి ఫైటన్నా లేదే.. అనుకున్న జనాలకు విందు చేస్తూ , సస్పెన్స్‌కి తెర మూసేసి, ఇప్పుడు బాహుబలి వచ్చింది. కనువిందు చేసింది. కత్తి ఫైట్స్‌కి ఈ సినిమాలో కొదవే లేదు. ప్రభాస్‌, రానా అరివీర భయంకరులుగా కనిపించారు. కత్తి దూసి కదనరంగంలో పుర్రెలు పగలగొట్టారు. వీళ్లతో పాటు అవంతిక, కట్టప్ప, కాళికేయ రూపంలోనూ కత్తి పట్టి శత్రువులపై విరుచుకుపడే పాత్రలు కనిపించాయి. ఒక్కసారిగా మన పూర్వికుల కత్తిసాముకు తిరిగి లైఫ్‌ వచ్చినట్లు అనిపించింది.

బాహుబలి 2లో అంతకంటే అసాధారణమైన కత్తి ఫీట్స్‌ చూడబోతున్నారని రాజమౌళి హింటిచ్చారు. అన్నట్టు అసలు ఈ కత్తి పట్టించడం, కత్తుల్లో కొత్త రకం వాటిని తెరపైకి తీసుకురావడం జక్కన్నకే చెల్లింది.
Tags:    

Similar News