దానికి పెద్ద హంగామా చేశారు: సుష్మిత సేన్

Update: 2018-08-21 01:30 GMT
మాజీ మిస్ యూనివర్స్ - సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ సుష్మిత సేన్ రీసెంట్ గా మీడియాతో  మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఒక రిపోర్టర్ తనను "మీ లైఫ్ లో ఎప్పుడైనా మీ బరువు గమనించి దానివల్ల ఇబ్బంది పడ్డారా?" అని అడిగితే అవును అని చెప్పి తనకెదురైన ఒక సంఘటన గురించి చెప్పింది.

"అవును. అలాంటిది నాలుగేళ్ల క్రితం జరిగింది.  నేను బరువు పెరిగిన సమయంలో నేషనల్ లెవెల్ టీవీ ఛానల్ లో వసీం అక్రమ్ తో ప్రోగ్రాం చేయడానికి వెళ్లాను. అంతే.. అప్పుడు నా వెయిట్ ఎక్కువగా ఉండడంతో అది పెద్ద హాట్ టాపిక్ అయింది... నేషనల్ న్యూస్ అయిపోయింది. న్యూస్ చానల్స్ లో కింద స్క్రోలింగ్ వస్తుంది కదా అక్కడ 'మీరు సుష్మితా సేన్ ను చూశారా?' అంటూ పెద్ద హంగామా చేశారు."

"దీంతో నేను ఒక విషయం నేర్చుకున్నాను. నేను వెయిట్ తగ్గుతాను. కానీ మనం ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ తమ క్యారెక్టర్ ను పోగొట్టుకున్న వాళ్ళ గురించి ఏం చేద్దాం? ఈ బాడీషేమింగ్(రూపాన్ని బట్టి మనుషులను అవహేళన చేయడం) అనేది మంచి కాన్సెప్ట్ కాదు. నాకు అదెప్పుడు నచ్చలేదు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన లైఫ్ లో హెచ్చు తగ్గులుంటాయి. మీరు ఎప్పుడూ ఐడియల్ గా - పర్ ఫెక్ట్ గా ఉండలేరు.  నేను మీకు మరో విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. కొంతమందికి వంశపారంపర్యంగా సమస్యలు ఉంటాయి.. మరికొంత మందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో అలోచించి మాట్లాడాలి. అవతలవాళ్ళను ఎదో ఒకటి అనడం సులువు.  మేము లైమ్ లైట్ ఉంటాం కాబట్టి మమ్మలి ప్రతీ  క్షణం జడ్జ్ చేస్తారు."

"మీరు ఎలా ఫీల్ అయ్యారు అని నన్ను స్ట్రెయిట్ గా అడిగితే.. నేను బ్యాడ్ గా ఫీలయ్యాను. నాకున్న మానసిక స్థైర్యం పక్కవాళ్ళకు కనబడదు కదా. అందుకే నేను నా ఫిట్నెస్ పై వర్క్ చేశాను. జనాలు అన్నారని కాదు. నేను ఒక స్ట్రాంగ్ వుమన్. అందుకే ఇప్పుడు ఇలా ఉన్నాను(అంటూ పర్ ఫెక్ట్ ఫిట్ నెస్ తో ఉన్న తనను చూపించింది)."

మీ దృష్టిలో ఇప్పుడు బాలీవుడ్ లో ఉన్న వారిలో అత్యంత ఫిట్ గా ఉన్న సెలబ్రిటీ ఎవరు అని అడిగితే తడుముకోకుండా టైగర్ ష్రాఫ్ అని చెప్పింది.
Tags:    

Similar News