• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #సుశాంత్...

#సుశాంత్ వీడియో..అక్క‌చెల్లెళ్లతో వెల‌క‌ట్ట‌లేని అనుబంధం

By - Tupaki Desk
Update: 2020-08-16 12:10 GMT
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆక‌స్మిక మ‌ర‌ణం వెన‌క కార‌ణాల‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో రియా చ‌క్ర‌వ‌ర్తిపై సుశాంత్ కుటుంబం పోలీస్ కేసులు న‌మోదు చేసి కోర్టుల్లో పోరాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే సోదరి శ్వేతా సింగ్ తో సుశాంత్ కి స‌త్సంబంధాలు లేవ‌ని ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి ఆరోపించింది. అత‌డికి కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయ‌ని శివ‌సేన నాయ‌కుడు సంజ‌య్ రౌత్ ఆరోపించ‌డం సంచ‌ల‌న‌మైంది.

కానీ ఈ కేసులో ముంబై పోలీసులు.. సీబీఐ ద‌ర్యాప్తు చెబుతున్న నిజాలు వేరేగా ఉన్నాయి. సుశాంత్ మరణించి రెండు నెలలైంది. సీబీఐ ఈడీ ద‌ర్యాప్తుల్లో ర‌క‌ర‌కాల నిజాలు నిగ్గు తేల్తున్నాయి. ఈ ఆదివారం సోషల్ మీడియాలో సుశాంత్ నలుగురు సోదరీమణులతో క‌లిసి ఉన్న ఒక అపురూప‌మైన‌.. అమూల్యమైన వీడియోను సోద‌రి శ్వేత స్వ‌యంగా షేర్ చేశారు.

`ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ` విడుదల సమయంలోని వీడియో ఇది. ఈ వీడియోలో సుశాంత్ కి త‌న సోద‌రీమ‌ణులు అంటే ఎంత ప్రేమాభిమానాలో బ‌య‌ట‌ప‌డింది. వీడియోను షేర్ చేసి శ్వేతా ఆవేద‌న‌తో కూడిన‌‌ క్యాప్షన్ ఇచ్చింది. ``ఆనందం ఉంది.. మేం ఎంతో ఆనందించాం. క‌లిసి సూర్యుని ఎండ‌లో గ‌డిపిన క్ష‌ణాలు ఉన్నాయి. కానీ ఆ చిరునవ్వు హుషారు ఆ సీజన్లు అన్నీ పోయాయి. మనం అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను ... ఎల్ల‌పుడూ నీవు మాతోనే ఉంటావు`` అంటూ ఎమోష‌న‌ల్ అయ్యింది.

ఈ వీడియోతో పాటు సుశాంత్ చిన్ననాటి ఫోటోను కూడా శ్వేతా పంచుకున్నాడు. దానికి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని ఇచ్చారు. ``మీరు దేనినైనా విశ్వసించినప్పుడు దాని కోసం పోరాడండి. అన్యాయాన్ని చూసినప్పుడు మీరు ఇంతకుముందు పోరాడిన దానికంటే కష్టపడతారు`` అంటూ బ్రాడ్ మెల్ట్జర్ కొటేష‌న్ ని షేర్ చేశారు. సీబీఐ ద‌ర్యాప్తులో సుశాంత్ కుటుంబానికి న్యాయం జ‌ర‌గాల‌ని అభిమానుల డిమాండ్లు అంత‌కంత‌కు వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. న్యాయం కోసం సిస్ట‌ర్స్ పోరాటం ఫ‌లిస్తుంద‌నే ఆశిద్దాం.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    
  • Sushant Singh Rajput 
  • Sisters 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS