• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  24.. టార్గెట్ 240 కోట్లు

24.. టార్గెట్ 240 కోట్లు

By - Tupaki Desk
Update: 2016-04-28 11:30 GMT
రజినీకాంత్.. కమల్ హాసన్ తర్వాత తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య. ఈ ఫాలోయింగ్ కారణంగానే అతడి సినిమాల స్థాయి ఎంతో పెరిగింది. మంచి కంటెంట్ ఉన్న సినిమా పడాలే కానీ.. 50 కోట్ల బడ్జెట్.. 100 కోట్ల బిజినెస్.. 150 కోట్ల వసూళ్లు అన్నది సూర్యకు పెద్ద విషయం కాదు. ‘24’ ఆ తరహా మూవీనే అని చెప్పొచ్చు. విక్రమ్ చెప్పిన కథ నచ్చి తనే సొంతంగా ఈ సినిమాను నిర్మించాడు సూర్య. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా విక్రమ్ అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్టే పెట్టాడు ఈ సినిమాకు. ట్రైలర్లో విజువల్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఎంత భారీ బడ్జెట్ సినిమానో. తక్కువలో తక్కువ రూ.50 కోట్లయినా ఖర్చు పెట్టే ఉంటాడు సూర్య.

ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైనప్పటి నుంచి సినిమా మీద మాంచి హైప్ ఉండటంతో రెండు భాషల్లో కలిపి వంద కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా వసూళ్లు ఎంత ఉంటాయా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే సూర్య కజిన్.. ‘24’ సహ నిర్మాత అయిన జ్నానవేల్ రాజా.. 24 సినిమా వసూళ్ల టార్గెట్ రూ.240 కోట్లని చెబుతున్నాడు. 24.. 240 నంబర్ కలిసిందని తానీ మాట అనట్లేదని.. ఆ టార్గెట్ ను అందుకునే సత్తా ఈ సినిమాకు ఉందని అతను కాన్ఫిడెంటుగా చెప్పాడు. రెండు భాషల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా ‘24’ సినిమా 2150 థియేటర్లలో రిలీజవ్వబోతున్నట్లు కూడా జ్నానవేల్ చెప్పాడు.

సినిమాకు మంచి టాక్ రావాలే కానీ.. ఇంత భారీగా విడుదలవుతున్న సినిమా జ్నానవేల్ చెబుతున్నట్లు 240 కోట్ల గ్రాస్ వసూలు చేయడం పెద్ద విషయమేం కాదు. హిట్ టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్ లోనే ఈజీగా వంద కోట్ల మార్కును టచ్ చేసే అవకాశాలున్నాయి.
Tags:    
  • Suriya 24 Movie 
  • 24 Movie 
  • Telugu NEws 

Similar News

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

Copyright @2026

Powered by Blink CMS