టాక్‌: అమరావతిలో రామానాయుడు స్టూడియో

Update: 2017-11-23 04:34 GMT
రాష్ట్ర విభజన తరవాత ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి అవకాశాలు ఉన్న నగరంగా అందరూ గుర్తించినది విశాఖపట్నం. సినిమా ఇండస్ట్రీకి వైజాగ్ ఎప్పటి నుంచో ఫేవరెట్ సిటీ. సినిమా షూటింగులకు అన్నివిధాలా అనుకూలమైన వాతావరణం ఇక్కడుంటుంది. అందుకే మూవీ మొఘల్ రామానాయుడు విశాఖలో సినిమా స్టూడియో కూడా నిర్మించారు. తాజాగా ఇండస్ట్రీలో కొంతమంది రాజధాని అమరావతిపై ఫోకస్ పెట్టారు.

అమరావతిని రానున్న రోజుల్లో దేశంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇక్కడ పట్టు పెంచుకోగలిగితే వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడం తేలికవుతున్నది అమరావతిని ప్రిఫర్ చేస్తున్న వాళ్ల ఆలోచనగా ఉంది. ఇండస్ట్రీలోని పెద్ద నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు అమరావతిలో స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ప్రభుత్వం భూమి ఇస్తే వైజాగ్ లో తన తండ్రి రామానాయుడు కట్టిన విధంగా అమరావతిలోనూ స్టూడియో కడదామని ప్లాన్ చేస్తున్నారనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఆయనతో పాటు మరికొంతమంది సినిమా పెద్దలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి స్టూడియోల నిర్మాణానికి భూములు కావాలని కోరినట్లు తెలుస్తోంది. హీరో - ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాత్రం సినిమాపరంగా విశాఖను అభివృద్ధి చేయడమే అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీని ఎక్కడ డెవలప్ చేయాలన్న దానిపై ఇంకా నిర్ణయమేదీ తీసుకోలేదని ఫిలిం డెవలప్ కార్పొరేషన్ ఛైర్మన్ అంబికా కృష్ణ అంటున్నారు. నంది అవార్డుల ప్రకటన తర్వాత వచ్చిన వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి స్పందించడమే మేలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. నంది అవార్డుల ఫంక్షన్ తరవాత దీనిపై నిర్ణయం తీసుకోవచ్చనేది తెలుస్తోంది.
Tags:    

Similar News