అప్పట్లో నిర్మాత అవుదామని అనుకోలేదు: సురేష్ బాబు

Update: 2020-04-22 09:10 GMT
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సీనియర్ నిర్మాతల్లో సురేష్ బాబు ఒకరు. లెజెండరీ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు గారికి వారసుడిగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను.. ఆయన లెగసీని కొనసాగిస్తూనే సురేష్ బాబు ఒక సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే సురేష్ బాబుకి మొదట్లో నిర్మాతగా మారాలనే
ఆలోచన లేదట. రామానాయుడు గారు కూడా సురేష్ బాబును సినిమాలు కాకుండా వేరే ఏదైనా  కెరీర్ ఎంచుకోమని చెప్పారట. అందుకే అమెరికాలో చదువు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత సిరామిక్స్ బిజినెస్ చేశారట సురేష్ బాబు. అయితే అది పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ప్రొడక్షన్ సంస్థలో పని చేయడం మొదలుపెట్టారు.

తనకు స్టోరీ జడ్జిమెంట్ స్కిల్స్ ఉన్నాయనే విషయం అప్పట్లోనే తెలిసిందట. స్టోరీ డిస్కషన్స్ లో మార్పులు చేర్పులు కూడా చెప్పేవారట. అయితే సురేష్ ప్రొడక్షన్స్ లో నాలుగేళ్లు పని చేసిన తర్వాత తిరిగి అమెరికాకు వెళ్లి పోదామని అనుకున్నారట. అయితే తమ్ముడు వెంకటేష్ ను హీరోగా లాంచ్ చేసే సమయం కావడంతో ఆగి పోయారట. వెంకీకి లాంచ్ బాగానే ఉన్నా ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అయ్యాయని..1990 లో 'బొబ్బిలి రాజా' ఘన విజయం సాధించడంతో వెంకీ కి మంచి బ్రేక్ వచ్చిందని చెప్పారు.  అప్పుడే తను కూడా నిర్మాతగా కొనసాగాలని.. వెంకీ సినిమాలకు సపోర్ట్ గా నిలవాలని నిర్ణయం తీసుకున్నారట.

సురేష్ బాబు మరో ఆసక్తికరమైన విషయం కూడా వెల్లడించారు. అప్పట్లో.. కమల్ హాసన్ లుక్స్ తన లుక్స్ ఒకే రకంగా ఉండటం.. ఇద్దరూ ఒకే రకమైన కార్ కావడంతో చాలామంది తనను కమల్ అనుకునే వారట. కమల్ ఫ్యాన్స్ కు తన కారులో నుంచి అభివాదం కూడా చేసేవాడిని చెప్పారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా తన సినిమాలో నటించమని ఒకసారి ఆఫర్ కూడా ఇచ్చారట. అయితే నటన పట్ల ఆసక్తి లేకపోవడంతో సున్నితంగా తిరస్కరించారట.
Tags:    

Similar News