#టీవీ న‌టి దుమారం.. కూతురుకే పోటీకొస్తే ఎలా మ్యాడ‌మ్?

Update: 2020-12-21 08:30 GMT
బుల్లితెర యాంక‌ర్ కం న‌టి సురేఖ వాణి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖా వాణి నిరంత‌రం బిజీ. గ‌త కొంత‌కాలంగా ఆమె రెగ్యుల‌ర్ ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌కో టీనేజీ డాట‌ర్ ఉన్నా.. త‌న‌తోనే పోటీప‌డుతోందా? అన్నంత‌గా షాక్ లిస్తున్నారు సురేఖ‌.

అయితే అందుకు స‌హేతుక‌ కార‌ణం లేక‌పోలేదు. కుమార్తె సుప్రిత న‌టిగా రంగ ప్ర‌వేశం చేయనున్నారు. సుప్రీత ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందారు. ల‌క్ష‌లాదిగా ఫ్యాన్స్ ఉన్నారు. న‌టిగా ఘ‌న‌మైన ఎంట్రీ కోరుకుంటున్నారు. ఆ క్ర‌మంలోనే కుమార్తె స‌క్సెస్ కోసం సురేఖ కొత్త టెక్నిక్ ని ప్లే చేస్తున్నార‌నేది ఓ గుస‌గుస‌.

టీనేజీ డాట‌ర్ తోనే పోటీప‌డుతూ.. సురేఖా వాణి సాధ్యమైనంత ఆకర్షణీయమైన రీతిలో కనిపించడం అగ్గి రాజేస్తోంది. 46 ఏళ్ల ఈ ట్యాలెంటెడ్ నటి పార్టీలు వేడుక‌ల్లో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్నారు. వీలున్న ప్ర‌తిసారీ తన ఫోటోల్ని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేస్తున్నారు. అవి అంత‌ర్జాలంలో సునామీని సృష్టిస్తున్నాయి.

సురేఖా వాణి తన స్నేహితురాలు కం నటి హేమ ఫోటోని కూడా షేర్ చేశారు. వారిద్దరూ ప్రీ-క్రిస్మస్ .. ఇయర్-ఎండ్ పార్టీల సెల‌బ్రేష‌న్ లో బిజీగా ఉన్నార‌ని ఈ ఫోటోలు చెబుతున్నాయి. ప్ర‌తి ఫోటోలోనూ సురేఖా వాణి తన కుమార్తెకు పోటీనివ్వ‌డంపై అభిమానులు స‌ర్ ప్రైజ్ అవుతున్నారు.
Tags:    

Similar News