డ్రోన్‌ లను రంగంలోకి దించిన సూపర్‌ స్టార్‌

Update: 2021-05-09 08:30 GMT
తమిళ సూపర్‌ స్టార్‌ అజిత్‌ సింప్లిసిటీ గురించి అందరికి తెల్సిందే. ఆయన చాలా సాదారణ వ్యక్తిగా కనిపించడంతో పాటు ఎవరికైనా సాయం కావాలంటే తనవంతు సహాయ సహకారాలను వెంటనే అందిస్తూ ఉంటాడు. ఈ కరోనా సమయంలో తన టీమ్‌ తో ఎన్నో సేవా కార్యక్రమాలను అజిత్ అందిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించడంతో పాటు కరోనా బారిన పడ్డ వారికి ట్రీట్ మెంట్‌ విషయంలో కూడా తనవంతు సహకారంను చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఈయన తన టీమ్‌ తో కలిసి డ్రోన్‌ లను ఉపయోగించి శానిటైజేషన్‌ చేశారు.

మద్రాస్ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ స్టూడెంట్స్ తో కలిసి అజిత్‌ డ్రోన్‌ ల తయారీ టెక్నాలజీని అభివృద్ది చేశారు. దక్ష అనే పేరుతో వీరు ఒక టీమ్ గా ఏర్పడి సామాన్యులకు అవసరం అయ్యే.. ఉపయోగదాయకమైన డ్రోన్‌ లను తయారు చేశారు. ఇటీవల వాటిని ప్రయోగించారు. తిరునల్వేలి జిల్లాలో ఈ డ్రోన్‌ లను ప్రోగించి వాటి పనితీరును పరిశీలించారు. ఆ డ్రోన్‌ లతో వీధులను మరియు పబ్లిక్ ప్లేస్‌ లను శానిటైజ్‌ చేయడంతో పాటు కరోనా రోగులకు అవసరం అయిన వస్తువులను కూడా అందిస్తున్నారు.

అజిత్ ఈ సమయంలో డ్రోన్స్ తో చేస్తున్న సాయం అందరి మనసులను గెలుచుకుంటుంది. మరోసారి అజిత్ రియల్‌ హీరోగా పేరు దక్కించుకున్నాడు అంటూ టాక్‌ వచ్చింది. ఇక అజిత్‌ ప్రస్తుతం వాలిమై సినిమా లో నటిస్తున్నాడు. కరోనా కారణంగా చిన్న బ్రేక్ ఇచ్చిన మేకర్స్ త్వరలోనే పూర్తి చేసి ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. బోణీ కపూర్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
Tags:    

Similar News