నాన్నే గురువై అన్నీ నేర్పించారు!-సూప‌ర్ స్టార్ మ‌హేష్

Update: 2021-09-05 08:30 GMT
సూప‌ర్ స్టార్ కృష్ణ రోజుకు మూడు షిఫ్టుల్లో ప‌ని చేస్తూ క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉండే రోజుల్లోనే మ‌హేష్ ని త‌న‌తో పాటే షూటింగ్ లొకేష‌న్ల‌కు తిప్పేవారు. చిన్న‌ప్ప‌టి నుంచే మ‌హేష్ కి ఆన్ లొకేష‌న్ వాతావ‌ర‌ణం అల‌వాటు చేసింది ఆయ‌నే. ఆ త‌ర్వాత బాల‌కుడిగా ఎదిగే క్ర‌మంలో మ‌హేష్ ని బాల‌నలుడిగా ప‌రిచ‌యం చేసి ప్ర‌ధాన‌ పాత్ర‌ల‌తో ప‌లు సినిమాల్ని నిర్మించారు. ఆ ర‌కంగా మ‌హేష్ కి న‌ట‌న‌లో ఓన‌మాలు నేర్పింది కృష్ణ‌గారే. ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ తండ్రిని మించిన త‌న‌యుడిగా నిరూపించారు. ఈ ఎదుగుద‌ల వెన‌క గురువు ఎవ‌రు? అంటే నిరభ్యంత‌రంగా సూప‌ర్ స్టార్ కృష్ణ‌నే.

అందుకే నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు తన తండ్రి గురువు అయిన‌ సూపర్‌స్టార్ కృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్ త‌న గురువును త‌ల‌చుకునే సంద‌ర్భాన్ని అస్స‌లు మిస్ చేసుకోలేదు.  మ‌హేష్ స్టార్ డ‌మ్ ఇటీవ‌ల టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కూ విస్త‌రించింది. అతను సింగపూర్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని సాధించుకున్నారు.

దేశంలోని అగ్ర క‌థానాయకుల్లో ఒక‌రిగానే కాదు.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ లలోనూ బాలీవుడ్ హీరోల‌కు తీసిపోనివాడిగా స‌త్తా చాటుతున్నారు. సూపర్‌స్టార్ ఎంత ఎదిగినా అంతే ఒద్దిక‌గా వినయపూర్వకంగా నేల‌పై నిలిచే స్వ‌భావాన్ని క‌లిగి ఉన్నారు.  త‌న తండ్రి గురువు అయిన సూపర్ స్టార్ కృష్ణకు త‌న విజ‌యాల్ని అంకిత‌మిచ్చారు మ‌హేష్‌.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మహేష్ బాబు ట్విట్టర్ లో ఒక అందమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. ``ప్రతిరోజూ నేర్చుకోవడం .. అపార‌మైన‌ ప్రేమ ఇక్కడ ఉంది! ప్రేమించడం.. బలంగా ఉండటం.. క్రమశిక్షణ.. కరుణ.. వినయం కలిగి ఉండడం నేర్పించిన నాన్నకు ధన్యవాదాలు`` అని మ‌హేష్ పోస్ట్ చేశాడు. సూపర్ స్టార్ తన తండ్రితో తన చిన్ననాటి ఫోటోని కూడా పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ వినయవిధేయ‌త‌లను ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఈ ఫోటోగ్రాఫ్ లో క‌ళ్ల‌జోడుతో మ‌హేష్ ఎంతో క్యూట్ గా క‌నిపిస్తున్నాడు. అన్నిటినీ మించి తండ్రి నోటి నుంచి ఊడిపడ్డాడు అన్నంత క్లీన్ ప్ర‌తిబింబంలాగా క‌నిపిస్తున్నాడు.

స‌ర్కార్ వారి పాట ఎంత‌వ‌ర‌కూ?

సూప‌ర్ స్టార్ మహేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట` చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్న సంగ‌తి తెలిసిన‌దే.  చిత్ర‌ బృందం కీలక సన్నివేశాలను  గోవాలో పూర్తి చేసారు.సెకండ్ వేవ్ కరోనావైరస్ తర్వాత స‌ర్కార్ వారి బృందం ఇటీవల హైదరాబాద్ లో సినిమా షూటింగ్ ని మొద‌లెట్టారు. గోవా షెడ్యూల్ ని ముగించారు. ఇటీవ‌ల రిలీజైన #BLASTER కోసం బ్లాక్ బస్టర్ ప్రతిస్పందన తెలిసిన‌దే.

ఆగష్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు నాడు సినిమా నిర్మాతలు `సర్కారు వారి పాట` టీజర్ ను విడుదల చేయ‌గా వైర‌ల్ గా దూసుకెళ్లింది. ఈ చిత్రం నుండి మ‌హేష్‌ లుక్ ను మొదటిసారిగా ఆవిష్కరించ‌గా దీనికి గొప్ప స్పందన లభించింది. కీర్తి పక్కింటి అమ్మాయి పాత్రలో కనిపించగా.. మహేష్ ఇందులో కలెక్టర్ గా అప్పులు వ‌సూలు చేసే వాడిగా డ్యూయ‌ల్ షేడ్ ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తారు. మ‌హేష్ స‌రికొత్త హెయిర్ స్టైల్ తో మాసీ లుక్ తోనూ అల‌రించ‌నున్నారు. అలాగే మ‌హేష్ - కీర్తి లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ ఓ రేంజులోనే వ‌ర్క‌వుటైంద‌ని టీజ‌ర్ తెలిపింది. థమన్ ఈ చిత్రానికి ట్యూన్ లు కంపోజ్ చేస్తున్నారు. 13 జనవరి  2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    

Similar News